
కరోడ్‌పతి ఫాతిమా
ఈమె పేరు ఫిరోజ్ ఫాతిమా(22). ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు చెందిన ఈమె కోన్‌బనేగా కరోడ్‌పతి-7 సీజన్‌లో తొలి మహిళా కోటీశ్వరురాలిగా నిలిచారు.
ఈమె పేరు ఫిరోజ్ ఫాతిమా(22). ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు చెందిన ఈమె కోన్‌బనేగా కరోడ్‌పతి-7 సీజన్‌లో తొలి మహిళా కోటీశ్వరురాలిగా నిలిచారు. తద్వారా ఈ షోలో రూ.కోటి గెలుచుకున్నారు. బీఎస్సీ చదివిన ఫాతిమా ఆర్థిక కారణాల వల్ల తన సోదరి చదువు కోసం ఉన్నత విద్యాభ్యాసం చేయాలన్న తన కలను త్యాగం చేశారు.
మరణించిన తన తండ్రి చేసిన అప్పు తీర్చడం కోసమే ఈ పోటీలో పాల్గొన్నానని.. రోజూ పేపర్లు చదవడం, న్యూస్ చానళ్లు చూడటం ద్వారా ప్రపంచవ్యాప్త పరిణామాల గురించి తెలుసుకున్నానని ఫాతిమా చెప్పారు. వచ్చిన డబ్బుతో పై చదువులు చదవాలనుకుంటున్నానని.. తన తల్లికి సౌకర్యవంతమైన జీవితాన్ని అందించాలనుకుంటున్నానని తెలిపారు. ఫాతిమా రూ. కోటి గెలుచుకున్న ఎపిసోడ్ డిసెంబర్ 1న సోనీ చానల్‌లో ప్రసారమవుతుంది.