మరో నలుగురిని ఉరి తీసిన పాక్
ఇస్లామాబాద్: 12 మందికి ఉరి వేసి... 24 గంటలు గడిచిందో లేదో మరో నలుగురికి పాక్ ప్రభుత్వం గురువారం ఉరిశిక్ష అమలు చేసింది. రావల్పిండి నగరంలో సోదరులు మహమ్మద్ అస్గర్, గులాం మహ్మమద్లతోపాటు గులిస్తాన్ జమన్లను ఈ రోజు అడియాల జైల్లో ఉన్నతాధికారుల సమక్షంలో ఉరి తీశారు. సోదరులు అస్గర్, గులాంలు ఇద్దరు బంధువులను హత్య చేశారు. జమాన్ 1997లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. అలాగే అబ్దుల్ సత్తార్ మెయిన్వాలి జైలులో ఉరి తీశారు.
1992లో సత్తార్ వ్యక్తిగత కక్ష్యతో హత్య చేశాడు. 2014 డిసెంబర్ 16న పెషావర్లో తీవ్రవాదులు ఆర్మీ స్కూల్పై దాడి చేసి 150 మందిని అంతమొందించారు. ఈ నేపథ్యంలో ఉరిశిక్షపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో నాటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 54 మంది నిందితులకు పాక్ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది.