బీఎస్ఎన్ఎల్ రోమింగ్ ఫ్రీ
న్యూఢిల్లీ: ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జూన్ 15 నుంచి ఉచితంగా రోమింగ్ సేవలు అందించనున్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. స్సెక్ట్రం షేరింగ్, ట్రేడింగ్ విధానాన్ని ఈనెలలోనే కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. పోస్ట్ శాఖకు ఆర్ బీఐ జూలై లేదా ఆగస్టులో బ్యాంకు లైసెన్స్ లు ఇచ్చే అవకాశముందన్నారు.
రోమింగ్ ఫ్రీతో బీఎస్ఎన్ఎల్ పుంజుకునే అవకాశముంది. మే 1 నుంచి ప్రవేశపెట్టిన 'ఉచిత కాల్స్' పథకం ల్యాండ్‌లైన్ కు ఊపిరిలూదింది. రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ నుంచి ఏ నెట్ వర్క్ ల్యాండ్‌లైన్, సెల్‌ఫోన్ల అయినా ఉచితంగా కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పించడంతో ఈ పథకం సక్సెస్ అయింది.