2018లో ఐఐటీల్లోకి మరింతమంది బాలికలు | IITs earmark 14 percent special quota for girls from 2018 | Sakshi
Sakshi News home page

2018లో ఐఐటీల్లోకి మరింతమంది బాలికలు

Published Sun, Apr 16 2017 10:36 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

IITs earmark 14 percent special quota for girls from 2018

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి ఐఐటీల్లో ప్రస్తుతం కన్నా ఎక్కువ మంది బాలికలకు సీట్లు లభించనున్నాయి. ఈ మేరకు అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ‘సూపర్‌ న్యూమరరీ’ సీట్లను సృష్టించాలని సంయుక్త ప్రవేశాల మండలి  శనివారం నిర్ణయించింది.  మొత్తం సీట్లలో దాదాపు 20 శాతం వరకు సూపర్‌ న్యూమరరీ సీట్లను సృష్టిస్తారు.

ఈ సీట్లన్నింటినీ కేవలం అమ్మాయిలకే కేటాయిస్తారు. అలాగే ఖాళీ అయిన సీట్లను తిరిగి బాలికలకే కేటాయిస్తూ వస్తారు. ఈ విధానం గరిష్టంగా ఎనిమిదేళ్ల వరకు కొనసాగే వీలుందని మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement