భారత్ ప్రతిష్ట మసకబారుతోంది: చోమ్‌స్కీ | India's image among those who care for freedom declining: Noam Chomsky | Sakshi
Sakshi News home page

భారత్ ప్రతిష్ట మసకబారుతోంది: చోమ్‌స్కీ

Published Mon, Mar 7 2016 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

భారత్ ప్రతిష్ట మసకబారుతోంది: చోమ్‌స్కీ

భారత్ ప్రతిష్ట మసకబారుతోంది: చోమ్‌స్కీ

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, మానవహక్కులు, న్యాయ పరిరక్షణకు కృషిచేస్తున్న వారిలో భారత ప్రతిష్ట తగ్గుతోందని ప్రముఖ తత్వవేత్త నోమ్ చోమ్‌స్కీ (87) అభిప్రాయపడ్డారు. అసహనంపై చర్చ భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచమంతా ఉందని ఒక జాతీయ వార్తా సంస్థ ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రాజకీయ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పరిస్థితి తెలుసుకునేందుకు విద్యాస్వేచ్ఛే ప్రధాన సూచికని ఎంఐటీలో భాషా, తత్వశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చోమ్‌స్కీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల ప్రైవేటీకరణతో స్వేచ్ఛ తగ్గిపోతుందన్నారు.  2016లో టర్కీ, ఇండియా, కైరో - మూడు దేశాల్లోని విద్యాసంస్థల్లో దాడులు చర్చనీయాంశలయ్యాని చెప్పారు.

Advertisement
Advertisement