క్రైమ్ సీరియళ్లు చూసి తండ్రిని చంపాడు
పట్నా: బిహార్లోని పూర్ణియా జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. క్రైమ్ సీరియళ్లు చూసి ప్రేరణ పొందిన ఓ బాలుడు తల్లి సాయంతో కన్నతండ్రిని హత్య చేశాడు. ఈ దారుణం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు తల్లికొడుకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ ఇనుప రాడ్, లాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడైన 14 ఏళ్ల బాలుడు తండ్రిని హత్యచేయడానికి ముందు క్రైమ్ పెట్రోల్, సావ్ధాన్ ఇండియా వంటి క్రైమ్ సీరియళ్లను చూశాడని పూర్ణియా జిల్లా ఎస్పీ నిష్నాంత్ తివారి చెప్పారు. తండ్రిని చంపి, ఆయన నుంచి ఆస్తి, వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని పథకం పన్నినట్టు తెలిపారు. ఇందుకు తల్లి కూడా కొడుకుకు సహకరించింది. నిందితుడి తండ్రి ఉపేంద్రకు వస్త్రతయారీ ఫ్యాక్టరీ ఉంది. బాలుడు ఇనుప రాడ్తో కొట్టి తండ్రిని చంపగా, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు తల్లి ప్రయత్నించింది. నిజజీవితంలో జరిగిన నేర సంఘటలను క్రైమ్ పెట్రోల్, సావ్ధాన్ ఇండియా వంటి క్రైమ సీరియళ్లు ఎపిసోడ్లుగా ప్రసారం చేస్తున్నాయి.