mother help
-
సీఎం ఆదేశాలతో కదిలిన వైద్య యంత్రాంగం
-
క్రైమ్ సీరియళ్లు చూసి తండ్రిని చంపాడు
పట్నా: బిహార్‌లోని పూర్ణియా జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. క్రైమ్ సీరియళ్లు చూసి ప్రేరణ పొందిన ఓ బాలుడు తల్లి సాయంతో కన్నతండ్రిని హత్య చేశాడు. ఈ దారుణం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు తల్లికొడుకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ ఇనుప రాడ్, లాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన 14 ఏళ్ల బాలుడు తండ్రిని హత్యచేయడానికి ముందు క్రైమ్ పెట్రోల్, సావ్ధాన్ ఇండియా వంటి క్రైమ్ సీరియళ్లను చూశాడని పూర్ణియా జిల్లా ఎస్పీ నిష్నాంత్ తివారి చెప్పారు. తండ్రిని చంపి, ఆయన నుంచి ఆస్తి, వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని పథకం పన్నినట్టు తెలిపారు. ఇందుకు తల్లి కూడా కొడుకుకు సహకరించింది. నిందితుడి తండ్రి ఉపేంద్రకు వస్త్రతయారీ ఫ్యాక్టరీ ఉంది. బాలుడు ఇనుప రాడ్‌తో కొట్టి తండ్రిని చంపగా, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు తల్లి ప్రయత్నించింది. నిజజీవితంలో జరిగిన నేర సంఘటలను క్రైమ్ పెట్రోల్, సావ్ధాన్ ఇండియా వంటి క్రైమ సీరియళ్లు ఎపిసోడ్లుగా ప్రసారం చేస్తున్నాయి. -
తల్లితో కలిసి భర్తను చంపేసిన భార్య
వేధిస్తున్న భర్తను తల్లితో కలిసి హతమార్చిందో భార్య. సంతోష్‌నగర్ బన్నికకు చెందిన ఎండీ గౌస్ (24)కు పటాన్చెరువు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ఫరీదా (21)తో రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి పాప, బాబు ఉన్నారు. ఫరీదా తల్లి ఆజీ బేగం మియాపూర్‌లోని న్యూకాలనీలో ఉంటోంది. అల్లుడు, కూతురు ఈమె వద్దే ఉంటున్నారు. గౌస్ జులాయిగా తిరిగేవాడు. మద్యం, గంజాయి తాగుతూ మైకంలో తరచు భార్యతో గొడవ పడేవాడు. భార్య, అత్తను చంపుతానని మూడు రోజులుగా జేబులో బ్లేడ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి గంజాయి తాగిన గౌస్ తన కుమారుడు జాఫర్ (8 నెలలు)ను చంపడానికి ప్రయత్నించగా భార్య ఫరీదా వారించింది. దాంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న అత్త గౌస్‌ను మందలించింది. మద్యం మత్తులో ఉన్న గౌస్ అత్త ముక్కును కొరికేశాడు. అతడు తమను చంపేస్తాడని భావించిన ఫరీదా, ఆజీ బేగం కలిసి గౌస్ బేబులోని బ్లేడ్ తీసుకొని.. అతడి గొంతునే కోసేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఫరీదా, ఆజీ బేగం మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. గౌస్‌ను చంపేశామని చెప్పి లొంగిపోయారు. గౌస్‌తో జరిగిన పెనుగులాటలో ఆజీ బేగంకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.