ఐఎస్ఐఎస్ దురాగతాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తాజాగా కొంతమంది యజీదీ మహిళలపై వాళ్లు బహిరంగంగా సామూహిక అత్యాచారాలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తర ఇరాక్లోని సింజర్ పట్టణం నుంచి అక్కడ వందలాది మంది మహిళలు, పిల్లలను ఎత్తుకుపోయి 8 నెలల పాటు బందీలుగా ఉంచారు. వారిలో కొందరిని సెక్స్ బానిసలుగా అమ్మేయగా.. మరికొందరిని ఉగ్రవాదులకు 'బహుమతి'గా కూడా ఇచ్చేశారు. దాదాపు అందరినీ విపరీతంగా కొట్టి, ఇస్లాంలోకి మారాలంటూ బలవంతం చేశారు.
హిమెరా నగరంలో ఉగ్రవాదులు ఈ వారం ప్రారంభంలో దాదాపు 200 మంది మహిళలను విడుదల చేశారు. వాళ్లు చెప్పిన కన్నీటి గాధలు విని.. పాషాణ హృదయాలు కూడా కరిగిపోయాయి. ఉగ్రవాదులు తమను బందీలుగా ఉంచి శారీరకంగా, లైంగికంగా ఎన్ని చిత్రహింసలు పెట్టారో కథలు కథలుగా చెప్పారు. ఒక్కో అమ్మాయి ఒక్కోరకంగా తమ బాధలను చెప్పారని, వాళ్లలో చాలామందిని ఉగ్రవాదులకు సెక్స్ బానిసలుగా అమ్మేశారని.. బహిరంగంగానే సామూహిక అత్యాచారాలు చేశారని చెప్పారు. యజీదీ సెక్స్ బానిసలు అనుభవిస్తున్న కష్టాలపై 2014 నవంబర్ నెలలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ 87 పేజీల నివేదిక ఒకదాన్ని వెలువరించింది. అప్పుడే ఈ విషయం చెప్పారు కూడా.
యజీదీ మహిళలపై బహిరంగ గ్యాంగ్రేప్!
Published Fri, Apr 10 2015 7:35 PM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM
Advertisement
Advertisement