కఠ్మాండు: నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇటీవల ముగిసిన ప్రత్యక్ష ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన నేపాలీ కాంగ్రెస్, తాజాగా జరిగిన దామాషా ఓటింగ్‌లోనూ తొలిస్థానంలో నిలిచింది. దామాషా పద్ధతిన మొత్తం 93,77,519 ఓట్లు ఉండగా, సుశీల్ కొయిరాలా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌కు 24,21,252 ఓట్లు లభించాయి. ఝాలానాథ్ ఖనాల్ నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్ పార్టీ 22,43,447 ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది. ప్రచండ నేతృత్వంలోని యూసీపీఎన్-మావోయిస్టు పార్టీ 14,38,666 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది.
ప్రత్యక్ష ఎన్నికలు 240 స్థానాలకు జరగగా, నేపాలీ కాంగ్రెస్‌కు 105, సీపీఎన్-యూఎంఎల్‌కు 91, యూసీపీఎన్-మావోయిస్టు పార్టీకి 26 స్థానాలు లభించించగా, చిల్లర పార్టీలకు 18 స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. దామాషా ఓట్ల ప్రకారం 335 మంది సభ్యులను ఎన్నుకోనుండగా, మిగిలిన 26 స్థానాలకు ప్రభుత్వమే సభ్యులను నామినేట్ చేస్తుంది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుపై నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ నేతలు చర్చలు ప్రారంభించారు.
నేపాల్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నేపాలీ కాంగ్రెస్
Published Fri, Nov 29 2013 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement