100 మందిపైగా చిన్నారులకు తప్పిన ముప్పు | Over 100 kids escape fire at a mall in China | Sakshi
Sakshi News home page

100 మందిపైగా చిన్నారులకు తప్పిన ముప్పు

Published Wed, Sep 16 2015 5:18 PM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

100 మందిపైగా చిన్నారులకు తప్పిన ముప్పు

100 మందిపైగా చిన్నారులకు తప్పిన ముప్పు

బీజింగ్: వందమందిపైగా చిన్నారులు చైనాలో అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డారు. తూర్పు ఫుజియన్ ప్రావిన్స్ లో షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పూల దుకాణంలో రేగిన మంటలు కిండర్ గార్డెన్ పాఠశాల ఉన్న రెండో అంతస్థుకు వ్యాపించాయి.

మంటల బారి నుంచి కొంతమంది చిన్నారులను అక్కడున్న పెద్దవాళ్లు కాపాడారు. మిగతా పిల్లలను అగ్నిమాపక సిబ్బంది రక్షించారని స్థానిక మీడియా తెలిపింది. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు వెల్లడికాలేదు.

Advertisement

పోల్

Advertisement