
రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ విభజన పూర్తి
ఆర్టీసీ విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. సమైక్య రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీగా ఉన్న ఈ సంస్థను ఇప్పుడు రెండుగా విభజించారు. మే 14వ తేదీ నుంచి విడివిడిగా రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ కార్యకలాపాలు నిర్వహిస్తారు.
ప్రధానంగా రెండు రాష్ట్రాలకు అధికారుల విభజన ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం పూర్తిచేసింది. దీంతో మే 14వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణకు టీఎస్ ఆర్టీసీగా పనిచేస్తాయి. పరిపాలన విభాగాలకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. బస్ భవన్లో ఎ బ్లాకును ఆంధ్రాకు, బి బ్లాకును తెలంగాణకు కేటాయిస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆస్తుల విభజన మీద మాత్రం ఇంకా చర్చలు ఓ కొలిక్కి రాలేదు.