RTC bifurcation
-
జూన్ 3న ఆర్టీసీ విభజన
కొత్త ముహూర్తం ఖరారు చేసిన ఎండీ 28న విభజన వాయిదాపై నిరసనల నేపథ్యంలో కొత్త తేదీ ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ విభజనకు కొత్త ముహూర్తం ఖరారైంది. జూన్ 3 నుంచి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు విడివిడిగా పనిచేయ బోతున్నాయి. ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలాభిడే కమిటీ పర్యవేక్షిస్తుండగా పని విభజనకు వీలుగా ఆర్టీసీ అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా స్థానికత ఆధారంగా ఎక్కడి వాళ్లు అక్కడే పద్ధతిలో అధికారులు, సిబ్బంది కేటాయింపు ఇప్పటికే పూర్తయింది. ఈనెల 28 నుంచి రెండు ఆర్టీసీలు విడివిడిగా పని ప్రారంభిస్తాయని గతంలోనే ఎండీ సాంబశివరావు ముహూర్తం ఖరారు చేశారు. కానీ అనూహ్యంగా దాన్ని వాయిదా వేస్తూ మూడు రోజుల క్రితం ఆయన మెమో జారీ చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆంధ్ర ప్రాంత అధికారులు ఆప్షన్ల పేరుతో తెలంగాణలో కొనసాగేందుకు వీలుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భౌగోళికం గా ఆంధ్ర ప్రాంతానికి చెంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు ఈడీగా వ్యవహరిస్తున్న జయరావు నుంచి ఆ బాధ్యతను తొలగిస్తూ తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణరావు ఆదేశాలు జారీ చేశారు. వెరసి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో ఆర్టీసీ ఎండీ కొత్త ముహూర్తాన్ని ఖరారు చేశారు. జూన్ మూడు నుంచి రెండు రవాణ సంస్థలు విడివిడిగా పనిచేస్తాయని వెల్లడిం చారు. జూన్ ఒకటి నాటికి రెండు రాష్ట్రాలకు కేటాయించే అధికారుల జాబితాను తేల్చాల్సి ఉంటుంది. కాగా, విభజన జరిగితే బస్‌భవన్‌లోని ఏ బ్లాక్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ, బీ బ్లాక్ కేంద్రంగా తెలంగాణ ఆర్టీసీ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి. నేడు షీలాభిడే కమిటీతో ఎండీ, జేఎండీ భేటీ ఆర్టీసీ విభజనకు సంబంధించి తీసుకున్న చర్య లు, ప్రస్తుత పరిస్థితిపై షీలాభిడే కమిటీ ఆర్టీసీ ఎండీని ప్రశ్నించింది. కమిటీ సభ్యులకు శుక్రవారం ఆ వివరాలు అందజేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణరావులు శుక్రవారం కమిటీతో భేటీ కానున్నారు. ఆర్టీసీ ఆస్తులు, అప్పులపై నిర్ణయించేందుకు జరగాల్సిన ఆర్టీసీ బోర్డు సమావేశం ఇప్పటికి నాలుగుసార్లు వాయిదాపడిన విషయాన్ని అధికారులు కమిటీకి వివరించనున్నారు. బోర్డు సమావేశం ఏర్పాటు చేసి దానిపై తుది నిర్ణయం తీసుకుని నివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశించే అవకాశం ఉంది. ఆగస్టు వరకు కమిటీ గడువు పొడిగింపు? షీలాభిడే కమిటీ గడువు ఈనెల 31తో ముగియనున్నా ఆర్టీసీ విభజన కొలిక్కి రాని నేపథ్యంలో కమిటీ గడువును పొడిగిస్తూ రేపో, మాపో ఉత్తర్వు వెలువడనుంది. కనీసం మూ డు నెలల గడువు అవసరమని కమిటీ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఆగస్టు వరకు గడువు పెంచే అవకాశం ఉందని సమాచారం. తాజా మెమోలోనూ మెలిక ? జూన్ 3న విభజన ముహూర్తం ఖరారు చేస్తూ గురువారం జారీ చేసిన మెమోలో పేర్కొన్న ఒక వాక్యంపై తెలంగాణ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో స్టేట్ క్యాడర్ పోస్టుల విభజన ఉంటుంది’ అని తాజా మెమోలో ఎండీ పేర్కొనడం, బస్ భవన్ కేంద్రంగా రెండు ఆర్టీసీల విభజన ఉంటుందనే మరో వాక్యానికి ఇది అనుసంధానంగా ఉండటంతో ఆ విభజన బస్ భవన్‌కే పరిమితం అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ విభజన పూర్తి
-
రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ విభజన పూర్తి
ఆర్టీసీ విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. సమైక్య రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీగా ఉన్న ఈ సంస్థను ఇప్పుడు రెండుగా విభజించారు. మే 14వ తేదీ నుంచి విడివిడిగా రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రధానంగా రెండు రాష్ట్రాలకు అధికారుల విభజన ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం పూర్తిచేసింది. దీంతో మే 14వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణకు టీఎస్ ఆర్టీసీగా పనిచేస్తాయి. పరిపాలన విభాగాలకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. బస్ భవన్లో ఎ బ్లాకును ఆంధ్రాకు, బి బ్లాకును తెలంగాణకు కేటాయిస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆస్తుల విభజన మీద మాత్రం ఇంకా చర్చలు ఓ కొలిక్కి రాలేదు. -
16న ఢిల్లీకి రండి..
* ఆర్టీసీ విభజనపై ఇరు సీఎస్‌లకు నితిన్ గడ్కారీ పిలుపు * సమస్యపై ఎట్టకేలకు దృష్టి సారించిన కేంద్రం * ఇద్దరు ప్రధాన కార్యదర్శులతో భేటీకానున్న కేంద్రమంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా ఉమ్మడిగానే సాగుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పై ఎట్టకేలకు కేంద్రం దృష్టి సారిం చింది. దీనికి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ఈ నెల 16న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు ఢిల్లీకి రావాల్సిం దిగా గడ్కారీ కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులకు లేఖలు అందాయి. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఆర్టీసీలో చోటు చేసుకున్న పరి ణామాలు, రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల వాదనలు, ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు, వాటి జారీ తర్వాత ఉత్పన్నమవుతున్న పరిస్థితులు, ఆస్తులు-అప్పులు, వాటి కేటాయింపునకు షీలాభిడే కమిటీ నిర్ణయాలు... ఇలా అన్ని వివరాలను గడ్కారీకి సమర్పించనున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు సీఎస్‌లు విడివిడిగా నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. సెలవు రోజైనప్పటికీ శనివారం ఆర్టీసీ ఈడీలు బస్‌భవన్‌లోనే ఉండి ఈ వివరాలను క్రోడీకరించారు. కేసీఆర్ జోక్యంతో వేగంగా..: ఆస్తులు, అప్పుల పంపకం జఠిలంగా మారిన నేపథ్యంలో ఆర్టీసీ విభజనలో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వాటి పంపకంతో సంబంధం లేకుండా టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు అనుమతించాలంటూ ఇప్పటికే టీ సర్కార్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ను కోరింది. ఇటీవల రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి.. గడ్కారీని కలసి ప్రభుత్వ పక్షాన వినతిపత్రం అందజేయడంతో పాటు సీఎం కేసీఆర్ ఫోన్లో చర్చించారు. దీంతో రెండు రాష్ట్రాల సీఎస్‌లను ఢిల్లీకి రావాల్సిందిగా శుక్రవారం లేఖలు పంపారు. వెంటనే బోర్డు సమావేశం? నితిన్ గడ్కారీతో భేటీ అయిన వెంటనే ఆర్టీసీ పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల కేటాయింపుపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తెలంగాణ ఉద్యోగుల పంపిణీకి జారీ అయిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలనే ఆర్టీసీ పేరు మార్చి అనుసరించింది. ఇందులో ఆప్షన్లకు అవకాశం కల్పించడాన్ని తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. ఇక నగరంలోని ఆర్టీసీ ‘ఉమ్మడి ఆస్తుల’కు సంబంధించి కేంద్రం నియమించిన షీలాభిడే కమిటీ ఆదేశంతో ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ మూల్యాం కనం చేసి ఓ నివేదికను అందజేసింది. వీటి కి బోర్డు ఆమోదం అవసరమున్నందున సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఢిల్లీ సమావేశంలో గడ్కారీ సూచనల ఆధారంగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. -
మరో నెల రోజుల్లో ఆర్టీసీ విభజన పూర్తి: ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్: మరో నెల రోజుల్లో ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఏపీ, తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థ వేరు పడుతందని తెలిపారు. ఈ ఏడాది మార్చినాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 1000 బస్సులు, అలాగే తెలంగాణకు 1300 బస్సులు రానున్నాయని ఎండీ పూర్ణచంద్రరావు చెప్పారు. -
ఆర్టీసీ విభజనలో కుట్ర జరుగుతోంది!
రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి తెలంగాణ అధికారుల ఫిర్యాదు ఆంధ్రాప్రాంత కన్సల్టెన్సీతో నివేదిక రూపొందించారు.. 10న జరగాల్సిన బోర్డు మీటింగును వాయిదా వేయించాలని వినతి అంతా చట్టప్రకారమే జరుగుతోందన్న ఆర్టీసీ యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ విభజన వ్యవహారం పీటముడిగా మారుతోంది. సామరస్యపూర్వకంగా రెండు కార్పొరేషన్లు ఏర్పడే తరుణంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆర్టీసీ సహా ఇతర కార్పొరేషన్ల విభజన వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రం నియుమించిన షీలాభిడే కమిటీ ప్రైవేటు కన్సల్టెన్సీకి నివేదిక తయారీ బాధ్యత అప్పగించటాన్ని తెలంగాణ ప్రాంత ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ తెలంగాణ అధికారుల సంఘం, టీఎంయూ నేతలు మంగళవారం సాయంత్రం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీకి బాధ్యత అప్పగించటం వెనక కుట్ర జరిగిందని, ఆ కన్సల్టెన్సీ ఇష్టానుసారంగా నివేదిక తయారు చేసి తెలంగాణను దెబ్బతీసేలా వ్యవహరించినందున ఆ నివేదికకు ఆమోదముద్ర పడకుండా చూడాలని మంత్రి దృష్టికి తెచ్చారు. పదో తేదీన బోర్డు సమావేశం జరగకుండా వాయిదావేరుుంచాలని వారు కోరారు. వుంత్రి ఆర్టీసీ ఎండీతో మాట్లాడేందుకు యత్నించినా ఆయన ఫోన్లో అందుబాటులోకి రాకపోవటంతో ఆర్టీసీ జేఎండీ రమణరావుతో మాట్లాడారు. పదోతేదీన బోర్డు సమావేశం వద్దని, తెలంగాణకు ప్రత్యేక బోర్డు ఏర్పాడ్డాక సమావేశం నిర్వహించటం మంచిదని సూచించారు. నష్టాలను రూ.700 కోట్లు పెంచారు... గతంలో ఆర్టీసీ అధికారులతో కూడిన విభజన కమిటీ తెలంగాణ ఆర్టీసీ నష్టాలను రూ.1100 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత నష్టాలను రూ.2,700 కోట్లుగా చూపితే... దాన్ని ప్రైవేటు కన్సల్టెన్సీ మార్చివేసి తెలంగాణ నష్టాలను రూ.1,800కు పెంచి ఆంధ్రాప్రాంత నష్టాలను అంతమేర తగ్గించిందని కార్మిక నేతలు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనివల్ల మొత్తం అప్పుల్లో తెలంగాణ వాటా పెంచే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆర్టీసీ వైద్యశాల ఆస్తిని లెక్కగట్టే క్రమంలో గజం ధరను రూ.38 వేలుగా పరిగణించి దాని విలువను భారీగా పెంచారని, పంపకం సమయంలో అంతమేర పరిహారం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని, ఇది పెద్ద భారంగా మారుతుందని వివరించారు. అంతా విభజన చట్టం ప్రకారమే.. ఈ ఆరోపణలను ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే కసరత్తు జరుగుతోందని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. హెడ్‌క్వార్టర్‌లోని ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా పరిగణించాలని చట్టం లో ఉందని, ఆమేరకే ఆస్తుల లెక్కగట్టి కన్సల్టెన్సీ నివేదిక సిద్ధం చేసిందన్నారు. అంతిమంగా రెండు ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగానే విభజన జరుగుతుందని, ఈ నివేదికలేవీ ప్రావూణికం కావని ముక్తాయించారు.