మావారిని విడిచిపెడితేనే..పోలీసుల విడుదల!
Published Sun, Jun 22 2014 8:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM
సనా: షియా హౌతీ తిరుగుబాటుదారులు సనా రాజధాని యెమిని లో పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో గాయపడిన 17 మంది పోలీసులను షియా తిరుగుబాటుదారులు బందీలుగా చేసుకున్నారు. సనా ప్రాంతో గస్తీ తిరుగుతున్న రెండు పోలీసు వాహనాలపై షియా హౌతీ గ్రూప్ కు చెందిన కొందరు గన్ మెన్లు దాడికి పాల్పడినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
సనా పరిసర ప్రాంతాల్లోకి షియా గ్రూప్ చేస్తున్న ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రోడ్లపై బారికేడ్లు నిర్మించామని.. ఆకారణంగానే పోలీసులపై దాడి చేశారని మంత్రిత్వశాఖ సంబంధించిన వెబ్ సైట్ లో అధికారులు సమాచారాన్ని పోస్ట్ చేశారు. అయితే దాడి అనంతరం షియా గ్రూప్ ఓ వీడియోను విడుదల చేసింది.
పోలీసుల ఆధీనంలో ఉన్న తమ అనుచరులను విడిచిపెడితే కాని.. బందీలుగా పట్టుకున్న పోలీసులను వదిలేది లేదని షియా తిరుగుబాటుదారులు స్పష్టం చేశారు. గత రెండునెలలుగా కొనసాగుతున్న షియా తిరుగుబాటుదారులకు, పోలీసులకు మధ్య జరిగిన పోరులో 200 మందికి పైగా మరణించారు.
Advertisement