weapons smuggling
-
ఆయుధాలు స్మగ్లింగ్.. జాతీయ క్రీడాకారుడు అరెస్ట్
భోపాల్: ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న జాతీయ కబడ్డీ క్రీడాకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనితోపాటు మరో ముగ్గురు కూడా పోలీసులకు చిక్కారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి 5 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన రింకు జాట్ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు. అతను గతంలో ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్లతో పాటు దబాంగ్ ఢిల్లీ జట్టు తరపున ఆడాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి క్రెటా కారులో గుణ వైపు నుంచి శివపురి వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఓ బృందంగా ఏర్పడి మైనా ఓవర్ బ్రిడ్జికి చేరుకొని ఆ రూటును పోలీసులు బ్లాక్ చేశారు. కొంతసేపటికి నిందితులు కారు అటు వైపు రావడంతో ఆ కారుని ఆపి అందులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 పిస్టల్ మ్యాగజైన్లతో సహా మూడు అదనపు మ్యాగజైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుర్హాన్‌పూర్‌కు చెందిన సిగ్లిగార్ల నుంచి పిస్టల్స్ తీసుకువచ్చినట్లు నిందితులు విచారణలో చెప్పారు. వీటిని సరఫరా చేసిన వ్యక్తి సమాచారం కూడా నిందితులు ఇవ్వడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఒక బృందాన్ని కూడా అక్కడకు పంపినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తనయుడి నిర్వాకం.. చీటింగ్ కేసు నమోదు -
తుపాకుల వ్యాపారం గుట్టురట్టు
భువనేశ్వర్: రాజధాని నగరంలో తుపాకుల వ్యాపారం ముఠా గుట్టు రట్టయింది. స్పెషల్ టాస్క్ఫోర్సు (ఎస్టీఎఫ్) చేపట్టిన దాడుల్లో నిందితులు పట్టుబడ్డారు. నగరంలో మారణాయుధాల విక్రయ సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ముందస్తు సమాచారం ఆధారంగా ఎస్టీఎఫ్ సోమవారం చేపట్టిన దాడులు ఫలప్రదమయ్యాయి. ఈ దాడుల్లో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిని స్థానిక ప్రైవేట్ కళాశాలలో బీబీఏ విద్యార్థిగాగుర్తించారు. మారణాయుధాల అక్రమ లావాదేవీల్లో విద్యార్థి ప్రధాన నిందితుడు కావడం సర్వత్రా కలకలం సృష్టించింది. నిందితుడిని ఝార్కండ్ నుంచి వచ్చిన షాను పొద్దార్‌గా గుర్తించారు. 7.65 మిల్లీమీటర్ల మూడు ఆటోమేటిక్ పిస్తోళ్లతో ఐదు మ్యాగజైన్లు, 22 రౌండ్ల పేలని తూటాల్ని స్వాధీ నం చేసుకున్నారు. స్థానిక ఖండగిరి ఐటీఆర్ కళాశాల ప్రాంతంలో సురేష్ పాణిగ్రాహి అనే వ్యక్తికి ఈ ఆయుధాల్ని విక్రయించేందుకు వచ్చి నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఒక్కో తుపాకీ రూ.1 లక్ష వెలతో విక్రయించేందుకు కుదిరిన ఒప్పందం మేరకు ఆయుధాలు ఏర్పాటు చేసినట్లు నిందితుడి ప్రాథ మిక సమాచారం. తుపాకులపై ఉన్న ముద్రలను బట్టి అవి కిర్కీ (పూణే) ఆయుధాగారం నుంచి బయటపడినట్లు తెలుస్తోందని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ డీఐజీ జె.ఎన్.పంకజ్ తెలిపారు. పటిష్టంగా విచారణ మావోయిస్టు వర్గాలతో నిందితుడికి రహస్య సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. ఈ ఆయుధాల సేకరణ, క్రయ–విక్రయాలు, సరఫరా–కొనుగోలు వగైరా సమాచారం ఆరా తీసేందుకు విచారణ పటిష్టంగా నిర్వహిస్తున్నారు. తెర వెనుక ముఠా గుట్టు తెలుసుకునేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కృషి చేస్తోంది. నిందితులను కోర్టులో హాజరుపరిచి అభ్యర్థించి త్వరలో రిమాండ్‌కు తీసుకుని మారణాయుధాల లావాదేవీల్లో నిందితుడి పాత్ర, అనుబంధ వర్గాల గుట్టురట్టు కోణంలో ప్రశ్నిస్తామని ఎస్టీఎఫ్ డీఐజీ పంకజ్ తెలిపారు. -
అక్రమంగా ఆయుధాల రవాణా
నాగోలు: నగరంలో అక్రమంగా ఆయుధాలు రవాణా చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరస్థుల్ని ఎల్బీనగర్, మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు పిస్టల్, రెండు బుల్లెట్స్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ తెలిపిన మేరకు.. మహారాష్ట్ర లోని థానే జిల్లాలోని భివాడీకి చెందిన దత్తు విరేష్ కోహ్లి(31), అదే ప్రాంతానికి చెందిన శ్యాం సుందర్, భూమయ్య వాడపల్లిలు కలసి పిస్టల్ అమ్మకాలు చేస్తున్నారు. దత్తుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన జంసీర్ అలియాస్ హుస్సేన్‌లు పరిచయస్తడు అతని వద్ద తక్కువ ధరకు ఆయుధాలను కొనుగోలు చేసి మహారాష్ట్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్నాడు. ఇతనితో పాటు శ్యాంసుందర్‌కూడా మహారాష్ట్ర, తెలంగాణలో అక్రమంగా పిస్టల్స్ తీసుకువచ్చి అమ్ముతున్నారు. దత్తు విరేష్ కోహ్లీ, శ్యాంసుందర్ నగరానికి వచ్చి ఎల్బీనగర్ ప్రాంతంలో శ్రీ సాయి లాడ్జిలో మకాం వేశారు. లాడ్జీలో ఉంటూ నగరంలో వీటిని అమ్మేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు, ఎల్బీనగర్ పోలీసులు దాడి చేసి వీరి వద్ద నుంచి రెండు పిస్టల్స్, రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందుతుడైన జంసీల్ అలియాస్ హుస్సేన్ పరారీలో ఉన్నాడని ఇతని కోసం స్పెషల్ పార్టీ ఆఫీసర్లు గాలింపు చేపట్టారని తెలిపారు. పారిపోయిన నిందితుడికి నగరంలో పాత కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ నవీన్ కుమార్, అశోక్ రెడ్డి, ఎస్సైలు అవినాష్, రత్నం, సిబ్బంది పాల్గొన్నారు. -
మావారిని విడిచిపెడితేనే..పోలీసుల విడుదల!
సనా: షియా హౌతీ తిరుగుబాటుదారులు సనా రాజధాని యెమిని లో పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో గాయపడిన 17 మంది పోలీసులను షియా తిరుగుబాటుదారులు బందీలుగా చేసుకున్నారు. సనా ప్రాంతో గస్తీ తిరుగుతున్న రెండు పోలీసు వాహనాలపై షియా హౌతీ గ్రూప్ కు చెందిన కొందరు గన్ మెన్లు దాడికి పాల్పడినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. సనా పరిసర ప్రాంతాల్లోకి షియా గ్రూప్ చేస్తున్న ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రోడ్లపై బారికేడ్లు నిర్మించామని.. ఆకారణంగానే పోలీసులపై దాడి చేశారని మంత్రిత్వశాఖ సంబంధించిన వెబ్ సైట్ లో అధికారులు సమాచారాన్ని పోస్ట్ చేశారు. అయితే దాడి అనంతరం షియా గ్రూప్ ఓ వీడియోను విడుదల చేసింది. పోలీసుల ఆధీనంలో ఉన్న తమ అనుచరులను విడిచిపెడితే కాని.. బందీలుగా పట్టుకున్న పోలీసులను వదిలేది లేదని షియా తిరుగుబాటుదారులు స్పష్టం చేశారు. గత రెండునెలలుగా కొనసాగుతున్న షియా తిరుగుబాటుదారులకు, పోలీసులకు మధ్య జరిగిన పోరులో 200 మందికి పైగా మరణించారు.