
పడవ బోల్తా : 20 మందికిపైగా గల్లంతు
చైనా: చైనాలోని జియాంగ్జూ నదిలో గురువారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారని ఉన్నతాధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని తెలిపారు. గల్లంతైన వారిలో ముగ్గురిని సహాయక బృందం రక్షించారని చెప్పారు.
గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇప్పటికే 23 నౌకలు, పడవలను నదిలో జల్లిడి పడతున్నాయని తెలిపారు. అయితే నదిలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందన్నారు. గల్లంతైన విదేశీయుల్లో జపాన్, సింగపూర్, ఫ్రెంచ్ దేశాలకు చెందిన ఎనిమిది మంది ఉన్నారని ఉన్నతాధికారులు చెప్పారు.ఈ ప్రమాదం గురువారం సాయంత్రం చోటు చేసుకుందని తెలిపారు.