Yangtze river
-
ఒక డ్యామ్.. భూమిని స్లో చేసింది
ప్రపంచంలోనే అతి భారీగా.. చైనాలోని యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్ డ్యామ్‌ను నిర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ డ్యామ్.. 2.33 కిలోమీటర్ల పొడవునా 181 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. దీనితో 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్‌లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుందని అంచనా. రోజు పెరిగింది.. భారీ డ్యామ్, రిజర్వా యర్‌లో నిలిచే నీటి బరువు ఓవైపు.. డ్యామ్ నుంచి విడుదలయ్యే నీరు 150 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంటే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్ప డిందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల భూమి భ్రమణవేగం అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గిందని.. రోజు గడువు 0.06 మైక్రోసెకన్లు పెరిగిందని తేల్చారు. అంతేకా దు ఈ భారీ డ్యామ్ వల్ల.. భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏమిటీ ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’? వేగంగా, గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ అన్నివైపులా సమానంగా సర్దుకుంటాయి. అన్నివైపులా సమాన బరువు ఏర్పడుతుంది. అలాకాకుండా ఏదో ఒకచోట భారీ బరువు చేరినప్పుడు జడత్వం (ఇనెర్షియా) నెలకొని.. సదరు వస్తువు తిరిగే వేగం తగ్గిపోతుంటుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల భూమిపై ఇలాంటి ప్రభావమే పడి.. భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి పొరల కదలికలు కూడా ప్రభావితమయ్యాయని, చిన్న స్థాయిలో భూకంపాలు వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ డ్యామ్‌ను పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు. త్రీగోర్జెస్.. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్.. భూమ్మీద మనుషులు నిర్మించిన డ్యామ్‌లలో అదీ ఒకటి అంతేకదా అంటారా.. కాదు.. అది అన్నింటిలో ఒకటి కాదు.. ఏకంగా భూమి తిరగడాన్నే స్లో చేసేసింది. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
331కి పెరిగిన మృతుల సంఖ్య
బీజింగ్: పెనుతుఫాన్ తాకిడికి చైనాలోని యాంగ్జీ నదిలో పర్యాటక నౌక మునిగిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 331కు పెరిగింది. జూన్ 1న సంభవించిన ఈ ప్రమాదంలో ఈస్టర్న్ స్టార్ అనే పర్యాటక నౌకలో ప్రయాణిస్తోన్న 450 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. గల్లంతైన వారిలో కేవలం 14 మందిని మాత్రమే సహాయ బృందాలు కాపాడగలిగినట్లు, శనివారం నాటికి 331 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. 149 మర బోట్లు, 59 భారీ యంత్రాలు, ఒక హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని, ఇందులో 3,500 మంది సైనికులు, 1700 మంది పారామిలటరీ పాలుపంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
చైనా నౌక నుంచి 26 మృతదేహాలు వెలికితీత
జియాన్లీ: చైనాలోని యాంగ్జీ నదిలో జరిగిన నౌక ప్రమాదంలో సహాయక సిబ్బంది ఇంతవరకూ 26 మృతదేహాలను వెలికి తీశారు. ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రమాదానికి గురైన నౌకలో 405 మంది పర్యాటకులు, ఐదుగురు టూరిస్ట్ గైడ్లు, 46 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 15 మందిని ప్రాణాలతో రక్షించారు. ఆచూకీ గల్లంతైన 400 మందికి పైగా యాత్రికులు మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఆసియాలోనే అత్యంత పొడవైన యాంగ్జీ నదిలో సోమవారం రాత్రి ఈస్టర్న్ స్టార్ అనే పర్యాటక నౌక తుపానులో చిక్కుకుని మునిగిపోయిన విషయం తెలిసిందే. సాధ్యమైనంతమంది పర్యాటకుల్ని ప్రాణాలతో రక్షించడానికి 3 వేల మంది సహాయక సిబ్బంది, 110 గాలింపు నౌకలతో పాటు హెలికాప్టర్లను రంగంలోకి దించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. -
చైనాలో నౌక ప్రమాదం
-
నౌక మునక.. 450 మంది గల్లంతు
ఆసియా ఖండంలోనే అతి పొడవైన నదిగా పేరొందిన చైనాలోని యాంగ్జీ నదిలో ఘోర నౌకా ప్రమాదం జరిగింది. ఈస్టన్ స్టార్ అనే నౌక పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తోన్న 450 మంది గల్లంతయ్యారు. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దక్షిణ చైనాలోని నింజింగ్ నుంచి చోంక్వింగ్ కు బయలుదేరిన నౌకకు ప్రయాణం మధ్యలో ప్రతికూల వాతావరణం ఎదురైంది. తీవ్ర తుఫాను, పెనుగాలులు తాకిడికిగురై నీటిలో మునిగిపోయిందని, ప్రమాద స్థలికి చేరుకున్న సహాయ బృందాలు కెప్టెన్, చీఫ్ ఇంజనీర్ సహా కేవలం ఎనిమిది మందిని మాత్రమే కాపాడగలిగామని చైనా నౌకా దళం అధికారులు చెప్పారు. తప్పిపోయినవారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశామన్నారు. గల్లంతైనవారిలో 405 ప్రయాణికులు, 47 మంది నౌకా సిబ్బంది, ఐదుగురు ట్రావెల్ ఏజెన్సీకి చెందినవారు ఉన్నట్లు చైనా అధికారిక మీడియా జిన్హువా పేర్కొంది.ప్రస్తుతానికి కూడా తుఫాను తీవ్రత తగ్గక పోవడంతో సహాయ కార్యక్రమాలు మందకోడిగా సాగుతున్నాయి. చైనా ప్రీమియర్ లీ కెక్వింగ్.. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. -
పడవ బోల్తా : 20 మందికిపైగా గల్లంతు
చైనా: చైనాలోని జియాంగ్జూ నదిలో గురువారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారని ఉన్నతాధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని తెలిపారు. గల్లంతైన వారిలో ముగ్గురిని సహాయక బృందం రక్షించారని చెప్పారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇప్పటికే 23 నౌకలు, పడవలను నదిలో జల్లిడి పడతున్నాయని తెలిపారు. అయితే నదిలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందన్నారు. గల్లంతైన విదేశీయుల్లో జపాన్, సింగపూర్, ఫ్రెంచ్ దేశాలకు చెందిన ఎనిమిది మంది ఉన్నారని ఉన్నతాధికారులు చెప్పారు.ఈ ప్రమాదం గురువారం సాయంత్రం చోటు చేసుకుందని తెలిపారు.