తతతతత తాబేలు.. | strange turtle found at east godavari district .. | Sakshi
Sakshi News home page

తతతతత తాబేలు..

Published Sun, Jul 17 2016 7:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

strange turtle found at east godavari district ..

మామిడికుదురు: మామూలు తాబేళ్ల కంటే బిన్నంగా ఒంటిపై వన్నెల గళ్లతో విలక్షణంగా కనిపించే నక్షత్రతాబేళ్లను చూశాం. కానీ ఫొటోలో కనిపిస్తోన్నది మాత్రం అత్యంత అరుదైన తాబేలు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో గోదావరిలో లభించిన ఈ నక్షత్ర తాబేలు అసాధారణమైన రంగులతో ఉంది. ఒంటిపై పసిడి, నలుపు, గోధుమ రంగులతో పాటు మెడకు ఇరువైపులా గంధం, సింధూరం రంగు చారికలు ఉన్నాయి.

ఆదివారం గోదావరిలో వేట కు వెళ్లిన పొన్నమండ గంగరాజు వలకు ఈ తాబేలు చిక్కింది. మామూలు తాబేలు గోళ్లు మెత్తగా ఉండి, తోక రెండంగుళాలు ఉంటుందని, తన వలకు చిక్కిన తాబేలు గోళ్లు గట్టిగా ఉండి, తోక నాలుగు అంగుళాలు ఉందని గంగరాజు చెప్పారు. ఈ తరహా తాబేలును చూడడం ఇదే ప్రథమమన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement