నేపాల్ కొత్త ప్రధానిగా సుశీల్ కోయిరాలా
కాఠ్మాండ్: నేపాల్ కొత్త ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కోయిరాలా ఎన్నికైయ్యారు. తన పార్టీకి మెజారిటీ లేకపోయినా , పార్లమెంట్ లో కోయిరాలకు మూడింట రెండొంతులు బలం ఉండటంతో ఆయన ప్రధానిగా ఎన్నికైయ్యారు. దీంతో గత సంవత్సరం కాలంగా ఉన్న రాజకీయ స్తబ్ధతకు తెరపడింది. కోయిరాలకు సీపీఎన్-యూఎమ్ఎల్ అండగా నిలబడటంతో అతని ఎన్నిక ఖాయమైంది.
405 మంది సభ్యులు కోయిరాలకు అనుకూలంగా ఓటేయడంతో ఆయన ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగుమైంది. కాగా, యూసీపీఎన్-మావోయిస్టు పార్టీ, నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలతో సహా కొన్ని పార్టీలు కోయిరాలాకు వ్యతిరేకంగా ఓటేశాయి.