ఆ కుటుంబానికి ఏడు పద్మ అవార్డులు! | The Bachchans now have seven Padma awards in the family | Sakshi
Sakshi News home page

ఆ కుటుంబానికి ఏడు పద్మ అవార్డులు!

Published Mon, Jan 26 2015 6:14 PM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

ఆ కుటుంబానికి ఏడు పద్మ అవార్డులు!

ఆ కుటుంబానికి ఏడు పద్మ అవార్డులు!

ముంబై: బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ మూడోసారి పద్మ పురస్కారం అందుకోబోతున్నారు. దేశ రెండో అత్యున్నత పురస్కారం 'పద్మవిభూషణ్' ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆయనకు ప్రకటించింది. దీంతో ఆయన పురస్కారాల్లో మూడో పద్మ అవార్డు చేరినట్టైంది. బిగ్ బి 1984లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అందుకున్నారు.

తాజాగా ప్రకటించిన పద్మవిభూషణ్ తో కలిపి బచ్చన్ కుటుంబం 7 పద్మ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని బిగ్ బి స్వయంగా తెలిపారు. తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్నారని గుర్తు చేశారు. తన భార్య జయాబచ్చన్ పద్మశ్రీ, తన కోడలు ఐశ్వర్యరాయ్ పద్మశ్రీ దక్కించుకున్నారని వెల్లడించారు. కాగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు అమితాబ్ అన్నివిధాలా అర్హుడని ప్రకటించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సరికొత్త చర్చకు తెరతీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement