ఐపీవో బాటలో ట్విట్టర్
వాషింగ్టన్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ పబ్లిక్ ఇష్యూని చేపట్టనుంది. ఇందుకు అనుమతించమంటూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్‌ఈసీ)కు ఈ అమెరికన్ టెక్నాలజీ సంస్థ దరఖాస్తు చేసుకుంది. 2006లో ఆవిర్భవించిన ట్విట్టర్ విలువను వాల్‌స్ట్రీట్ జర్నల్ 10 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. ప్రముఖ వ్యక్తులు(సెలబ్రిటీలు), రాజకీయ వేత్తలు, క్రీడాకారులు, జర్నలిస్టులు తదితరులు తమ వ్యాఖ్యానాలు, అభిప్రాయాల వంటివి వెల్లడించేందుకు అత్యధిక స్థాయిలో ఈ సైట్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. వెరసి ట్విట్టర్ వేగంగా వృద్ధి చెందుతూ అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా సర్వీస్‌గా నిలుస్తోంది. ట్విట్టర్ వినియోగదారుల సంఖ్య 20 కోట్లుకాగా, ఈ ఏడాది ప్రకటనల ద్వారా 58.28 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగలదని, వచ్చే ఏడాదిలో ఇది 100 కోట్ల డాలర్లకు చేరగలదని విశ్లేషక సంస్థ ఈమార్కెటర్ అంచనా వేసింది.