టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
- మంత్రుల సమక్షంలో కరణం-గొట్టిపాటి వర్గీయుల ఘర్షణ
- ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నిక రసాభస
ఒంగోలు: తెలగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. మంగళవారం ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన మంత్రులు నారాయణ, సునీత, శిద్ధా రాఘవరావుల సమక్షంలోనే వైరివర్గాలు తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది.
ఇటీవల వేమవరంలో చోటుచేసుకున్న జంటహత్యలు.. గొట్టిపాటి రవికుమారే చేయించారని కరణం వర్గీయులు నినదించారు. ఆ వెంటనే గొట్టిపాటి అనుచరులు.. కరణం వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరుపక్షాలమధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. ఎంత వారించినా కార్యకర్తలు వినకపోవడంతో మంత్రులు సహా ముఖ్యనేతలంతా మిన్నకుండిపోయారు.
(చదవండి: అద్దంకి రక్తచరిత్ర)