తాటాకు చప్పుళ్లకు భయపడం
తాటాకు చప్పుళ్లకు భయపడం
Published Sat, Oct 1 2016 9:41 AM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM
కందుల వర్గీయులపై టీడీపీ అసమ్మతి నేతల ఫైర్
రెండు వేల మందితో త్వరలో చంద్రబాబు ఇంటి వరకు పాదయాత్ర
మార్కాపురం: నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుల నారాయణరెడ్డి వర్గీయుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని టీడీపీ అసమ్మతి నేతలు రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ఇమ్మడి కాశీనాథ్, పార్టీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, తర్లుపాడు సర్పంచ్ కందుల విజయ కళావతిలు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఇమ్మడి కాశీనాథ్ స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు.
గత 15 ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి, కందుల విజయానికి తోడ్పడ్డామని, అయితే కొందరు నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుండటంతో చంద్రబాబు నాయుడు, లోకేశ్, కళావెంకట్రావులను కలిసి వివరించామన్నారు. తాము వెళ్లి వచ్చిన తరువాత తమపై మార్కెట్ యార్డు చైర్మన్ డీవీ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గుప్తా ప్రసాద్, చైర్మన్ భర్త వక్కలగడ్డ మల్లికార్జున్, తాళ్లపల్లి సత్యనారాయణలు గురువారం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటం అర్ధరహితమని తెలిపారు.
పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇంకుడు గుంతల్లో కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమన్వయ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. తర్లుపాడు సర్పంచ్ కందుల విజయ కళావతిపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, వీటిపై దళిత సంఘాలు త్వరలో ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 21లోపు పరిస్థితిని చక్కదిద్దకపోతే 2000 మందితో మార్కాపురం నుంచి విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వరకు పాదయాత్ర చేపడతామని చెప్పారు.
బెల్ట్‌షాపులను నిరోధించకపోతే మేమే తొలగిస్తాం
ఊరూరా బెల్ట్‌షాపులు ఉన్నాయని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నా, ఎక్సైజ్ అధికారులు మామూళ్లు తీసుకుని పట్టించుకోవటం లేదని విమర్శించారు. రెండు రోజుల్లోపు వాటిని తొలగించకపోతే మార్కాపురం ఎక్సైజ్ అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. మహిళలు 94406 08787 ఫోన్ నంబర్‌కు సమాచారం అందిస్తే బెల్ట్ షాపులపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తొలగిస్తామని చెప్పారు. న్యాయవాదులు సండ్రపాటి ప్రసాద్, రవీంద్రనాథ్, ఎంపీటీసీ సాదం వీరయ్య, రహమాన్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement