ప్రాథమిక కీని అందుబాటులోకి తెచ్చిన టీఎస్‌పీఎస్సీ
* అభ్యంతరాల స్వీకరణ
* 24 లేదా 25న ఫైనల్ కీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షలో జనరల్ స్టడీస్, సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను టీఎస్‌పీఎస్సీ తమ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. అలాగే జవాబుల కీని కూడా అందుబాటులో ఉంచింది. ఇందుకోసం ప్రత్యేక లింకు ఇచ్చింది.
అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, ఇతర వివరాలు పొందుపరిచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే అభ్యర్థులు ప్రాథమిక కీపై అభ్యంతరాలను తెలిపేందుకు ప్రత్యేకంగా లింకు ఇచ్చింది. ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 24న ఫైనల్ కీ విడుదల చేయాల్సి ఉంది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీని 24 లేదా 25న విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రశ్నల సరళి ఇలా..: టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన తొలి పరీక్షలో జనరల్ స్టడీస్ పేపరులో తెలంగాణ కోణంలోనే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. జనరల్ స్టడీస్ (తెలుగు అనువాదం) పేపరులో ఒకటి నుంచి 15వ ప్రశ్న వరకు జాతీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ఇచ్చారు. ఇక 16 నుంచి 25 వరకు తెలంగాణకు సంబంధించిన ప్రశ్నలనే అడిగారు. 26 నుంచి 39వ ప్రశ్న వరకు ఇతర సాధారణ అంశాలకు సంబంధించినవి అడిగారు. 40 నుంచి 46 వరకు తెలంగాణ నీటి వనరులు, భౌగోళిక అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
47 నుంచి 54వ ప్రశ్న వరకు ఇతర, ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. 56 నుంచి 70వ ప్రశ్న వరకు తెలంగాణ సంస్కృతి, సాహిత్యానికి సంబంధించినవి, 71 నుంచి 88 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర అంతర్జాతీయ అంశాలపై ప్రశ్నలు ఇచ్చారు. 89 నుంచి 96వ ప్రశ్నవరకు తెలంగాణ, ఇతర సామాజిక అంశాలపై, 97 నుంచి 109వ ప్రశ్న వరకు పాలన, ఇతర సాంకేతిక అంశాలపై అడిగారు. 110 నుంచి 120 వరకు తెలంగాణ ఉద్యమం, ఇతర అంశాలపై, 120 నుంచి 135వ ప్రశ్న వరకు జనరల్ ఇంగ్లిషుపై అడగగా, 136 నుంచి 150 వరకు వివిధ అంశాలు, ప్రకటనలు, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. 1 నుంచి 120 ప్రశ్నల్లో ఏయే అంశాలు అడిగారన్న వివరాలు ఇలా ఉన్నాయి..
1. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచం ఏది?
2. శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు?
3. లైంగిక వేధింపులకు వర్తించే చట్టాలు ఏ కేసులో నిర్దేశించబడ్డాయి?
4. సుప్రీం జడ్జిని ఏ ఆధారాలపై తొలగించవచ్చు?
5. భారత్‌లో రాష్ట్రాల సరిహద్దులను మార్చే విధానం ఏ ప్రకరణలో ఉన్నది?
6. భారత్‌లో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఎవరు ప్రతిపాదించారు?
7. సర్ఫ్-ఎ-ఖాన్ అనగా?
8. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం
9. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు?
10. ప్రస్తుతం అమలులో ఉన్న ఆహార పథకాలను, ఆహార భద్రతా చట్టం 2013 ఈ కింది విధంగా మార్చింది
11. భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది
12. భారత్‌లో విద్య ఏ జాబితాలో ఉంది?
13. ‘రంప తిరుగుబాటు’ రూపకర్త
14. సమాచారహక్కు చట్టానికి సంబంధించి ఈ కింది వానిలో సరైనది కానిది ఏది?
15. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో వికలాంగుల సంక్షేమం పేర్కొనబడింది?
16. కాకతీయులు నిర్మించని చెరువు ఏది?
17. చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు?
18. నిజాం రాష్ట్ర జనసంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు?
19. హైదరాబాద్‌లోని రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేసిందెవరు?
20. తెలంగాణ ప్రథమ నవల ‘ప్రజల మనిషి’ రాసింది ఎవరు?
21. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి
22. తెలంగాణ ప్రజాసమితిలో ముఖ్య భూమిక పోషించిన నాయకురాలెవరు?
23. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ సాగర హారాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది?
24. 2009లో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన సుప్రీంకోర్టు తీర్పు ఏది?
25. 2001లో టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించబడినప్పుడు పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి తన ఇంటిలో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసుకోవటానికి అనుమతించింది ఎవరు?
26. ‘ఇండియా టుడే’ గ్రంథ రచయిత ఎవరు?
27. విలియం బెంటింక్ నియమించిన ‘న్యాయ కమిషన్’కు అధ్యక్షులు ఎవరు?
28. భారతదేశంలో ప్రచురితమైన మొదటి దినపత్రిక
29. ‘గులాంగిరి’ రచయిత ఎవరు?
30.ఈకింది వారిలో చంపారన్ సత్యా గ్రహంలో పాల్గొన్న నాయకుడు ఎవరు?
31. 1917 రష్యా విప్లవాన్ని స్తుతిస్తూ పద్యాలు రాసింది ఎవరు?
32. ఈ కింది వారిలో కాకోరి కుట్ర కేసుతో సంబంధం లేనిది ఎవరికి?
33. శారదా చట్టం ఏ సంవత్సంరలో చేయబడింది?
34. భారత ఉక్కుపరిశ్రమ పితామహుడు?
35. బెంగాల్ విభజన రద్దయిన సంవత్సరం
36. భారతదేశంలో ఉపగ్రహ డేటా ప్రాసెసింగ్ జరిగే కేంద్రం
37. వలసవల్ల సంభవించని పరిణామం
38. సివాలిక్ పర్వతాలకు మరో పేరు
39. ఈ కింది వాటిలో ఏది తోట వ్యవసాయానికి చెందిన పంట కాదు?
40. తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమ వైపు ఆనుకుని ఉన్న రాష్ట్రాల సంఖ్య
41.ప్రాణహిత నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది?
42. చెంచు తెగ ఎక్కువగా నివసించే జిల్లా
43. ఇటీవల తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఇనుప ఖనిజం నిల్వలు బయటపడ్డాయి?
44. తెలంగాణలో గౌడ లేదా గౌండ్ల కులస్తులు ఏ సాంప్రదాయ వృత్తి కలిగి ఉన్నారు?
45. కడెం రిజర్వాయర్ ఎక్కడ ఉంది?
46. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పేరు?
47. ‘కిన్నెరసాని’
48. ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ అంటే?
49. వయోవృద్ధుల సామాజిక, మానసిక, జ్ఞాన, జీవ సంబంధమైన అధ్యయనాన్ని ఏమంటారు?
50. గ్ఛ్చ్టిజి ౌజ ూ్చ్టజీౌట గ్రంథ రచయిత ఎవరు?
51. ఎఖీ అంటే?
52. జన్‌ధన్ యోజన ఉద్దేశం ఏమిటి?
53. మిశ్రమ ఆర్థిక విధానాలు అనుసరించిన వ్యక్తి?
54. 12వ పంచవర్ష ప్రణాకళిక రూపొందించిన సంస్థ
55. తెలంగాణలోని ఏ జిల్లా తక్కువ జనసాంద్రత కలిగి ఉంది?
56. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత
57. ‘ప్రస్తుత బీడు భూములు’ అంటే?
58. ఆహార పంటలకు కనీస మద్దతు ధర ఎవరు నిర్ణయిస్తారు?
59. రైల్వేలు దీనికి ఉపరంగం
60. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ పాట రచయిత ఎవరు?
61. లక్నవరం చెరువు ఎక్కడ ఉంది?
62. ‘మీజాన’ అనేది?
63. ‘కురుమూర్తి’ జాతర ఏ జిల్లాలో ప్రసిద్ధి?
64. గోలకొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులు ఎవరు?
65. ‘గటుక’ అనే తెలంగాణ సాంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారు చేస్తారు?
66. బతుకమ్మలో ఏ పూవును ప్రధానంగా వాడతారు?
67. రంగం అనే భవిష్యవాణి దేనితో ముడిపడి ఉంటుంది?
68. మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు స్వగ్రామం
69. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎవరు?
70. కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాలు జరిగిన సంవత్సరం?
71. సిస్టయిస్ అనే ఇన్‌ఫెక్షన్ ఈ కింది అవయవానికి సంబంధించింది
72. డెంగ్యూ వ్యాధిని వ్యాపింపచేసే దోమ పేరు?
73. నాసా (ూఅఅ) యొక్క ప్రఖ్యాత అంతరిక్ష టెలిస్కోప్ పేరు?
74. ఫెంగ్యూన్-110బీ అనే వాతావరణ సంబంధ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
75. అంతరిక్ష పరిశోధక నౌక్క ఔగఇ14 ఇటీవల ఓషియాసాట్-2తో పాటు ఎన్ని నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది?
76. మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది?
77. ‘షూటింగ్ స్టార్’ (జిౌౌ్టజీజ ్ట్చట) అనేది ఒక?
78. ‘క్యోట్ ప్రోటోకాల్’ దీనికి సంబంధించినది
79. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన రసాయనం
80. ‘ఊలజి’ (ైౌౌజడ) అంటే దేని అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం
81. ప్రవాళ భిత్తికల (ఇౌట్చ ట్ఛ్ఛజట) సంరక్షణార్థం భారత ప్రభుత్వం ఈ కింది దానిని మెరైన్ పార్క్‌గా ప్రకటించింది.
82. సాధారణంగా ఏ రకమైన ప్రకృతి వైపరీత్యాలకు బీమా వర్తించదు?
83. దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అమెరికా ఇటీవల ఏ దేశంతో చారిత్రక ఒప్పందం చేసుకుంది?
84. ‘అల్‌జజీరా’ అనేది ఒక
85. కింది వాటిలో సరైనది
86. అఅఖఇ ఉపగ్రహాన్ని ప్రతిపాదించిన దేశం?
87. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ఇటీవల చైనాలో ఏ నగరంలో జరిగింది?
88. వింబుల్డన్-2015లో మహిళల డబుల్స్‌లో గెలుపొందినది
89. దళిత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు?
90. ‘హరితహారం’ కార్యక్రమం ప్రారంభింపబడిన తేది?
91. సాగునీటి చెరువుల పునరుద్ధరణ కోసం ప్రారంభించిన పథకం?
92. ప్రొ-కబడ్డీ లీగ్ ఏర్పాటైన సంవత్సరం?
93. పేద ముస్లిం వధువులకు ఆర్థిక సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు?
94. ‘ఇచ్చంపల్లి’ ఏ జిల్లాలో ఉంది?
95. ‘అలీసాగర్’ ఎత్తిపోతల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
96. ‘వెట్టి’ అనగా?
97. దీని స్థానంలో ూఐఖీఐ ఆయోగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది?
98. ‘డిజిటల్ ఇండియా’ను ప్రారంభించింది?
99. ‘అదాని’ అనేది?
100. గఖీ అనగా?
101. ఇ-గవర్నెన్స్ మరియు సాంకేతిక సమాచార వ్యవస్థ (ఐఖీ)లను సమర్థవంతంగా వినియో గించుకుం టున్నందుకు ఇటీవల స్కో ఆర్డర్ ఆఫ్ మెరిట్ (జుౌజిైటఛ్ఛీటౌజ ఝ్ఛటజ్టీ) జాతీయ అవార్డును పొందిన రాష్ట్రం ఏది?
102. తెలంగాణ రాష్ట్ర పుష్పం?
103. ‘ఆక్సెసిబుల్ ఇండియా’ అనే నినాదం దేనికి సంబంధించినది?
104. ‘ఇండామిటబుల్ స్పిరిట్’ అనే పుస్తక రచయిత ఎవరు?
105. భారతదేశం ద్వీపకల్పంలో గల శిలలు?
106. గంగా మైదాన ప్రాంతంలో వర్షపాత తీవ్రత ఈ విధంగా తగ్గుతూ పోతుంది?
107. భారతదేశంలో పరిమాణాన్ని బట్టి అత్యంత చిన్న జిల్లా?
108. అమరావతి నది దేని ఉపనది?
109. కింది వానిలో ఏది భారత ఉపగ్రహ సెన్సర్?
110. ‘దాసి’?
111. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులతోపాటు 610 జీవో అమలుతీరును పరిశీలించడానికి ఏర్పాటైన ఏకసభ్య కమిషన్?
112. కూరగాయల నూనె (వెజిటబుల ఆయిల్) నుంచి వనస్పవతిని తయారు చేసే ప్రక్రియలో ఉపయోగించే వాయువు?
113. సూర్యరశ్మి (ఠటజిజ్ఛీ) విటమిన్ అనగా?
114. ధమనులలో పీడనాన్ని కొలిచే సాధనం?
115. ఎఔగఈ6లో ఉపయోగించే ఇంధనం?
116. భారత మొట్టమొదటి సూపర్ కంప్యూటర్?
117. ‘కంప్యూటర్ ప్రోగ్రామర్‌కు’ ఉండవలసిన ప్రాథమిక అవశ్య లక్షణ?
118. ‘విముక్తి కోసం’ సినిమా నిర్మాత పేరు?
119.తెలంగాణ సాధన కోసం పార్లమెంటు భవనం దగ్గర ఆత్మహుతి చేసుకున్న యువకుడి పేరు?
120. ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయ రచయిత?
వెబ్సైట్లో ఏఈఈ ప్రశ్నాపత్రాలు
Published Wed, Sep 23 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM
Advertisement
Advertisement