
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి నాలుగేళ్లవుతోంది.

ఈ సందర్భంగా భర్త గౌతమ్ కిచ్లుతో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అందులో కాజల్.. భర్తకు ప్రేమగా తినిపించింది. మరో ఫోటోలో ఇద్దరూ కలిసి డ్రింక్స్ తాగారు.

ఈ పోస్ట్ కింద హ్యాపీ ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ మై బెస్టీ గౌతమ్ కిచ్లూ .. ఎల్లప్పుడూ నాకు సపోర్ట్‌గా ఉంటున్నందుకు థాంక్యూ అని రాసుకొచ్చింది.

ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా కాజల్, గౌతమ్ కిచ్లు 2020 అక్టోబర్ 30న పెళ్లి చేసుకున్నారు.

వీరికి 2022లో కుమారుడు జన్మించగా అతడికి నీల్ కిచ్లు అని నామకరణం చేశారు.






