
హీరోయిన్ రాధిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

నటి, దర్శకురాలు, నిర్మాతగా పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది.

ఈమె తండ్రి ఎమ్.ఆర్ రాధ నటుడు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చేసింది.

1978లో 'కిళక్కి పోగుం రైల్' అనే తమిళ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది.

అప్పటినుంచి ఏడాది అరడజను నుంచి డజనుకి పైగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండేది.

1981 నుంచి తెలుగు సినిమాలు చేయడం మొదలుపెట్టింది.

మెగాస్టార్ చిరంజీవితోనే చాలా సినిమాలు చేసి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది.

పట్నం వచ్చిన పతివ్రతలు, అభిలాష, గూఢచారి నం.1, దొంగమొగుడు లాంటి 20 సినిమాల్లో చిరుతో రాధిక జంటగా నటించింది.

చివరగా తెలుగులో మొన్నీమధ్య రిలీజైన 'ఆపరేషన్ రావణ్' సినిమాలో రాధిక యాక్ట్ చేసింది.

1991 నుంచి సీరియల్స్‌లోనూ నటిస్తూ దక్షిణాదిలో ప్రతి ఇంటికి చేరువైంది.

అంతా బాగానే ఉంది కానీ ఈమె వైవాహిక జీవితమే కాస్త గందరగోళంగా ఉంటుంది.

మొదట ప్రతాప్ పోతన్ అనే నటుడిని తొలుత పెళ్లి చేసుకుంది. ఏడాదికే విడిపోయింది.

రిచర్డ్ హార్డీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని (1990-92) రెండేళ్లకే విడాకులు తీసుకుంది.

ముచ్చటగా మూడోసారి అప్పట్లో హీరో అయిన శరత్ కుమార్‌ని 2001లో పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో అద్భుతమైన నటిగా పేరు తెచుకున్న వరలక్ష‍్మి.. రాధికకు సవతి కూతురు అవుతుంది.



