
సెర్బియా నటి, తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో వివాహ బంధానికి ముగింపు పలికిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ తిరిగి ప్రేమలో పడ్డాడా?

మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

హార్దిక్ పాండ్యా.. బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది

గత కొన్ని రోజులగా జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం గ్రీస్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొద్ది రోజుల కిందట గ్రీస్‌లోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ దిగిన ఫోటోలను జాస్మిన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా హార్దిక్ కూడా అదే స్పాట్‌లో దిగిన ఫోటోలను షేర్ చేయడం ప్రస్తుతం చర్చానీయాంశమైంది.

జాస్మిన్ వాలియా బ్రిటిష్ సింగర్, టెలివిజన్ పర్సనాలిటీ





