
అయ్యో.. వైజాగ్ తాజ్ రాణి చంద్రమతి దేవి స్మృతి చిహ్నంగా నిర్మించిన ఈ సుందర కట్టడాన్ని విశాఖ వాసులు విశాఖ తాజ్ మహల్ గా పిలుచుకుంటారు. అద్భుతమైన ఈ కట్టడం పట్టించుకునేవారు లేకపో వడంతో ఇలా శిథిలావస్థకు చేరుకుంది. బీచ్ రోడ్డులోని ఈ కట్టడాన్ని పురావస్తుశాఖ సంర క్షించాలని స్థానికులు కోరుతున్నారు.

అలుసిస్తే అల్లేస్తాం.. పిచ్చిమొక్కల్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. నెల్లూరు వెంకటే శ్వరపురం టీద్యో గృహాల మధ్య ప్రదేశాన్ని శుభ్రపరచకుండా వదిలేయడంతో తీగజాతి మొక్కలు ఇలా ఇళ్లపై అల్లుకుంటూపోయాయి.

గుత్తులు గుత్తుల పంట.. గిట్టుబాటు ధరేదంట? పందిరి నిండా వేలాడిన ద్రాక్ష గుత్తులు చూసి రైతుకు కడుపు నిండిపోతుంది. కానీ.. పంట అమ్మకానికి పెట్టినప్పుడు గిట్టుబాటు ధర రాకపోతే ప్రాణం విలవిల్లాడిపోతుంది. అనంతపురం జిల్లా తిమ్మంపేటకి చెందిన వెంకట శివారెడ్డి ద్రాక్ష తోట ఇది. ఫలసాయం బాగు న్నా ధర లేకపోవడంతో ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతు కోరుతున్నాడు.

ప్రకృతి గీసే చిత్రాలు అద్భుతంగా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. నిప్పులు కక్కుతున్న డ్రాగన్లాగా కనిపిస్తోంది కదూ.. ఐస్ ల్యాండ్ ఓ అగ్ని పర్వతం బద్దలై లావా ప్రవహించినప్పుడు అదిలా డ్రాగన్ రూపంలో కనిపించింది.