1/7
సారె తిరిగితేనే సాపాటు.. కడుపుకింత తిండి దొరకాలంటే సారె తిరగాల్సిందే. గ్రామీణ జీవనంలో ఒక వెలుగు వెలిగిన కుమ్మరి కులవృత్తి ఆధునికకాలంలో స్టీల్, ప్లాస్టిక్ వస్తువులతో పోటీపడలేక రోజురోజుకీ అంతరించిపోతోంది. కులవృత్తిని వదులుకోలేని కొందరు చాలీచాలని ఆదాయంతో నెట్టుకొస్తున్నారు. విజయనగరం రింగురోడ్డు కుమ్మరివీధిలో ఓ వృద్ధుడు మట్టితో పాత్ర తయారుచేస్తున్న దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది.
2/7
తిరుపతికి బహ్మోత్సవ శోభ... బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ప్రధాన కూడళ్లన్నీ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిపిరి సర్కిల్‌ని విద్యుత్ దీపాలతో అలంకరించిన దృశ్యం.
3/7
మహాత్ముని స్మరణలో.. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో గాంధీజీ వేషధారణలో ఉన్న చిన్నారికి వందనం చేస్తున్న కళాకారులు.
4/7
బతుకమ్మ పండుగ వేళ బుధవారం హైదరాబాద్ నగరం లోని ప్రధాన పూల మార్కెట్లన్నీ కొనుగోళ్లు, అమ్మకాలతో సందడిగా మారాయి.
5/7
పెద్దసంఖ్యలో కొనుగోలుదారులు పూలను కొనుగోలు చేశారు.
6/7
హైదరాబాద్ మొజాంజాహీ మార్కెట్‌లో పూల అమ్మకాల దృశ్యం.
7/7
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో తొమ్మిదిరోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.