
ఒక్కన్ని చేసి ఇంతమంది ఆడుకుంటారా! మా వాళ్లకు తెలిస్తే ఏమైద్దో తెలుసా? ( ఫోటో : యాదిరెడ్డి, వనసర్తి)

పట్నం వాసుల మధ్య పల్లె వాసనలు ( ఫోటో : వరప్రసాద్, వరంగల్)

చూశారా అండి! ఈ చోద్యం.. పోలీసులు బైకు మీద త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు. మనకెందుకు.. అక్కడ ఏనుగు నాలుగు కాళ్ల మీద నడుచుకుంటూ పోతుంది చూడు. ( ఫోటో : కిషోర్, విజయవాడ)

సార్! నా జన్మధన్యమైంది.. ఈ ఫోటో పట్టుకుని సినిమాల్లో ట్రై చేస్తా.. (ఫోటో : శ్రీకాంత్, సిరిసిల్ల)

దేవుడా! ఓ మంచి దేవుడా! ఏలుకోవటానికి ప్రజల్నిచ్చావు.. చేయటానికి రాజకీయాల్నిచ్చావు.. ఎందుకయ్యా మధ్యలో ఎన్నికలంటూ చంపుతున్నావు..

సార్! వీలున్నపుడు మా వీధి వైపు వచ్చిపోతా ఉండండి.. ( ఫోటో : అరుణ్ రెడ్డి, అదిలాబాద్)

శ్రామికుడి కష్టం విలువ తెలిసినపుడే.. మన బుర్రలో, వీధుల్లో మురికి పేరుకుపోదు ( ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి)

వెలిగించిన ఈ కొవ్వత్తులు.. పోలీసు అమరవీరులకు నివాళులు (ఫోటో : ఎమ్‌వీ రమణ, గుంటూరు)

ఆకాశ వీధిలో.. గాలి బుడగతో రయ్యు.. రయ్యుమంటు( ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)

బుద్ధుడికి సైతం చిరాకు, కోపం తెప్పించే! హైదరాబాద్ ట్రాఫిక్ ( ఫోటో : కే రమేశ్ బాబు, హైదరాబాద్)

తోటి మనిషికి సహాయం చేయటానికి దేవుడు దిగిరాడు.. మనిషే రావాలి( ఫోటో : మనువిశాల్, హైదరాబాద్)

అందం.. అభినయం.. అపురూపం ఈ నాట్యం (ఫోటో : వీ రవీందర్, హైదరాబాద్)

ఉత్తిగే! ఆశీర్వదించి వెళ్లిపోతే సరిపోదు.. నీ ఓటు కూడా నాకే వెయ్యాలా!( ఫోటో : సాయిదత్, హైదరాబాద్

డప్పుల హోరు.. ప్రచారం జోరు..(ఫోటో : సాయిదత్, హైదరాబాద్)

నే కారువాణ్ని.. కారువాణ్ని.. కేసీఆర్ రూటు వాణ్ని (ఫోటో : సోమసుభాష్, హైదరాబాద్)

అప్పుడెప్పుడో చచ్చిపోయిన రావణున్ని మళ్లీ చంపటం మాత్రమే కాదు.. మనలో ఉన్న రావణున్ని చంపాలి( ఫోటో : రవికుమార్, హైదరాబాద్)

పందెంలో గెలిచారు.. చిరునవ్వుతో నిలిచారు .. ( ఫోటో : శ్రీశైలం, హైదరాబాద్)

జనం కోసం ప్రాణం విడిచారు.. పథిలంగా మా గుండెల్లో నిలిచారు.. ( ఫోటో : థశరధ్ రజ్వా, ఖమ్మం)

ఈ భక్తి రథం.. జైనుల ముక్తి రథం ( ఫోటో : హుశ్శేన్, కర్నూలు)

సమస్య నుంచి తప్పించుకోవాలంటే పాడెక్కాలి.. సమస్యను విన్న వించాలన్నా పాడెక్కాలి.. ఇది మన రైతుల కన్నీటి వ్యథ ( ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

నిప్పుతో వండుకుంటే తినగలరు కొందరు.. నిప్పుతో ఆడుకుంటేనే తినగలరు మరికొందరు ( ఫోటో : మురళీమోహన్, మహబూబాబాద్)

చేని గట్టు మీద కూర్చుని తిన్న సద్ది రుచుల ఆ అనుభూతి ముందు ప్రాశ్చాత్య చద్ది రుచులు నిలుచునా? (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

కటౌట్ చిన్నది.. కాంన్సెప్ట్ పెద్దది.. (ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

పోలీస్ అంకుల్! నా కళ్లల్లోకి సూటిగా చూసి చెప్పండి.. మీరొక్కసారైనా వీటిని వాడారా? ( ఫోటో : రాజ్‌కుమార్, నిజమాబాద్)

పట్టుదల ఉండమన్నారు పెద్దలు.. ఇలా వేలాడుతూ పట్టుకోమనలేదు ( ఫోటో : సతీష్ కే, సిద్ధిపేట)

ఓ నీలి.. నీలి మేఘమా... నింగిలో జారిపోకుమా! ( ఫోటో : మోహనక్రిష్ణ, తిరుమల)

శ్రమిస్తే ఆరోగ్యం నీ చెంతనుంటుంది .. బద్దకిస్తే మాత్రం అనారోగ్యం నీ వెన్నంటే ఉండి.. నీ అంతు చూస్తుంది. (ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)

కంటితో చూస్తే ఓ చిత్రం.. మనసుతో చూస్తే ఓ పరమార్థం.. నీ మనసు ఏం చెబుతోందో.. విను ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)

మనషుల పాపాల చిట్టా చదివి.. చదివి నామూతి చూశారా! ఎలా కందిపోయిందో.. (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

నా పనికే ఎసరు పెట్టేలాగున్నావు నాయకుడా! ( ఫోటో : కొల్లజు శివ, యాదాద్రి)

నగరం నిద్రపోతున్న వేళ.. కోటి కాంతుల లీల ( ఫోటో : కొల్లజు శివ, యాదాద్రి)