23న ఐటీఐలో జాబ్‌మేళా
పోచమ్మమైదాన్ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 23న వరంగల్‌లోని ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
జాబ్ మేళాలో కాల్ హెల్త్‌కేర్ లిమిటెడ్ వారు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. హోమ్ సర్వీస్ పోస్టులకు ఏఎన్ఎం, డీఎంపీహెచ్డబ్ల్యూ, జీఎన్ఎం పాసైన వారు అర్హులన్నారు. మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పక చేయించి ఉండాలన్నారు. 20 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. ఇంటర్వూ్యలు ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు 91332 50055 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు