A aa movie
-
Test Scheduler Audio
-
‘అఆ’.. 200 మిలియన్ వ్యూసా!!
యంగ్ హీరో నితిన్, సమంత జంటగా తెరపై కనువిందు చేసిన చిత్రం ‘అఆ’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ కుటంబ కథా చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేమ, కుటుంబ విలువలు.. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే తన దైన కామెడీ టైమింగ్‌ను జోడించారు త్రివిక్రమ్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం నిత్యం ఏదో ఒక ఘనతను తన ఖాతాలో వేసుకుంటోంది. ‘ఆఆ’ చిత్రం హిందీ వర్షన్లో అనేక రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే వన్ మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మరో మైలురాయిని అందుకుంది. తాజాగా హిందీ వర్షన్లో వచ్చిన ‘ఆఆ’ చిత్రానికి యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఉత్తరాది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని భారీగా ఆదరిస్తుండటం పట్ల హీరో నితిన్ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు ఇక టాలీవుడ్లో అంతగా ఆకట్టుకొని నితిన్ చిత్రాలు సైతం హిందీ వర్షన్లో భారీ హిట్టవుతున్నాయి. తాజాగా అఆ, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం హిందీ డబ్ వర్షన్‌కు యూట్యూబ్‌లో ఓవరాల్‌గా 400 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు ఆదిత్య మ్యూజిక్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతున్న ఆదిత్య మ్యూజిక్ వారు నిర్వహిస్తున్న ఆదిత్య మూవీస్ విభాగానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ఈ సినిమాను అప్లోడ్ చేశారు. వివద తెలుగు హీరోల హిందీ డబ్బింగ్ సినిమాలను ఆదిత్య మూవీస్ యూట్యూబ్‌లో విడుదల చేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోల హిందీ డబ్బింగ్ సినిమాలకు భారీగా వ్యూస్ వస్తున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. Thankuu all for the love ❤️❤️#Trivikramsir @Samanthaprabhu2 @vamsi84 @haarikahassine https://t.co/8voFd4pO4L — nithiin (@actor_nithiin) June 12, 2020 -
మరో రికార్డు క్రియేట్ చేసిన ‘అఆ’
యంగ్ హీరో నితిన్, సమంత జంటగా తెరపై కనిపించిన చిత్రం ‘అఆ’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పూర్తి కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ‘అఆ’తో నితిన్ ఖాతాలో భారీ హిట్ పడింది. ఇక త్రివిక్రమ్ స్టైల్లో మాటలు, విలువలు అందరినీ ఆకట్టుకుంటాయి. పాటలు కూడా సూపర్బ్‌గా ఉంటాయి. ఇక ఈ చిత్రం మరో మైలురాయిని అందుకుంది. ఈ సినిమా హిందీ వర్షన్లో రికార్డులు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి యూట్యూబ్‌లో మిలియన్స్ లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని హిందీ వర్షన్లో దాదాపు 20 కోట్ల మంది వీక్షించడం మరో విశేషం. ఇక వరుస విజయాలతో జోరుమీదున్న నితిన్‌కు ఉత్తరాదిన మంచి మార్కెట్ సెట్ చేసుకుంటున్నారు. సినిమాలను డైరెక్ట్‌గా హిందీలో రిలీజ్ చేయకపోయినా తెలుగులో రిలీజ్ అయిన కొద్ది రోజులకు డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో అంతగా ఆకట్టుకొని నితిన్ చిత్రాలు సైతం హిందీ వర్షన్లో భారీ హిట్టవుతున్నాయి. తాజాగా అఆ, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం హిందీ డబ్ వర్షన్‌కు యూట్యూబ్‌లో ఓవరాల్‌గా 400 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఆదిత్య మ్యూజిక్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఈశ్వర్, అల్లా, జీసస్‌లపై ఒట్టు: వర్మ సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1151264010.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హిందీలో దుమ్మురేపుతున్న త్రివిక్రమ్ సినిమా
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హీరో నితిన్, సమంత జంటగా నటించిన చిత్రం 'అ ఆ'. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై నితిన్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. అవునండి తెలుగులో హిట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి యూట్యూబ్‌లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్టు 26న 'అ ఆ' చిత్ర హిందీ వర్షన్‌ని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. మూడు రోజుల్లోపే ఈ చిత్రం 20 మిలియన్ల వ్యూస్ చేరుకుని రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో వేగంగా 10 మిలియన్ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. హీరో నితిన్ అయినా.. సినిమా ఎక్కువగా సమంత పాత్ర చూట్టూనే తిరుగుతుంది. అందుకు తగ్గట్టుగా సమంత కూడా అనసూయ పాత్రలో ఒదిగిపోయింది. సెంటిమెంట్, కామెడీ, అమాయకత్వం, పొగరు ఇలా అన్ని రకాల వేరియేషన్స్‌ను బాగా చూపించింది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ సమంత ఆకట్టుకుంది. చిత్రంలో చూపించిన పల్లె వాతావరణం, అందుకు తగ్గట్టుగా మిక్కి జె మేయర్ స్వరపరిచిన బాణీలు ఉత్తరాది సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలకు యూట్యూబ్ లో ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. హిందీలో డబ్ అయిన అల్లు అర్జున్ నటించిన సరైనోడు, దువ్వాడ జగన్నాథం చిత్రాలు ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఉన్న విషయం తెలిసిందే. -
‘అ..ఆ..’ తరువాత ‘ఇ..ఈ..’
నైరా షా, నీరజ్ శ్యామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా ‘ఇ..ఈ..’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రామ్ గణపతిరావు దర్శకుడు. లక్ష్మణరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశారు. కృష్ణ చేతన్ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియోను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ..’ లాగే ఈ ‘ఇ..ఈ..’ కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
'నాకు తెలుగు తెలియదు'
'అ ఆ' సినిమాలో నాగవల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా. పల్లెటూరి పిల్లగా అచ్చ తెలుగులో గలగల మాట్లాడుతూ సందడి చేసింది అనుమప్ పరమేశ్వరన్. అయితే ఆమెకు తెలుగు మాట్లాడడం రాదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మలయాళీ భామకు 'నాకు తెలుగు తెలియదు' అనే మాట తప్ప మరో ముక్కరాదు. అయినప్పటికీ 'అ ఆ'లో తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని అందరినీ ఆకట్టుకుంది. 'ఈ సినిమాలో నాకు చాలా తక్కువగా డైలాగులున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రోత్సాహంతో డబ్బింగ్ చెప్పాను. నాపై ఆయన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. ట్యూటర్ ను పెట్టుకోకుండానే డబ్బింగ్ చెప్పాను. నాగవల్లి పాత్రను తీర్చిదిద్దిన విధానం నాకు బాగా నచ్చింది. అందుకే వెంటనే ఓకే చెప్పా'నని అనుపమ్ పరమేశ్వరన్ వెల్లడించింది. 'అ ఆ' సినిమాలో తన పాత్రకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని తెలిపింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ప్రస్తుతం 'ప్రేమమ్' రీమేక్ లో ఆమె నటిస్తోంది. -
'పవన్ కళ్యాణ్ వస్తున్నారు'
హైదరాబాద్: నితిన్, సమంత జంటగా నటించిన 'అ ఆ' సినిమా ఆడియో ఫంక్షన్ డేట్ ఖరారైంది. మే 2న శిల్పకళావేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని హీరో నితిన్ వెల్లడించాడు. ఈ ఫంక్షన్ కు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ట్విటర్ ద్వారా తెలిపాడు. గతంలో నితిన్ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలకు పవన్ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం 'అ ఆ' సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్ కు వెళ్లి నితిన్ ను ఆశ్చర్య పరిచారు పవర్ స్టార్. ఆయన ముందు నటించడం చాలా ఆనందాన్నిచ్చిందని, ఒకింత నెర్వస్‌గా ఫీలయ్యానని ఈ సందర్భంగా నితిన్ ట్వీట్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'అ ఆ' సినిమాకు 'అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' అనేది ఉపశీర్షిక. మే నెలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. A aa audio on may2nd at shilpakala vedika and PAWAN KALYAN garu is the chief guest for the function.. — nithiin (@actor_nithiin) 29 April 2016