'అరకు ఉత్సవ్... అభివృద్ధి మాటేంటి?'
విశాఖ: విశాఖ జిల్లాలోని అరకు ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని గిరిజన సంఘాలు బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించాయి. హుద్-హుద్‌తో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు పూర్తి చేయకుండా అరక్ ఉత్సవ్ నిర్వహించడమేంటి?.. సబ్ కలెక్టర్‌ను గిరిజనులు నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్న అరకును అభివృద్ధి చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. జీవో నెంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు.