ఈ–సైకిల్’.. లోకల్ మేడ్
E Bicycle Homemade: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ అబ్దుల్ జలీల్ ఈ–సైకిల్ తయారు చేశారు. కేవలం రూ.6,200 ఖర్చుతో పాత సైకిల్‌ను ఈ–సైకిల్‌గా విజయవంతంగా మార్చారు. 20 ఏళ్లుగా బైక్ మెకానిక్ అనుభవం ఉన్న జలీల్ తన ఆలోచనతో పంటలపై రసాయన మందు పిచికారీ చేసే యంత్రంలో ఉపయోగించే 8.12 వోల్టుల రెండు బ్యాటరీలు, చైనా మోడల్ కిట్ (ఎక్స్‌లేటర్, మోటార్) అమర్చి ఈ సైకిల్‌ను తయారు చేశారు.
(చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!)
ఇది గంటన్నర చార్జింగ్‌తో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని జలీల్ తెలిపారు. ముందుగా ఈ ప్రయోగం పాత సైకిల్‌తో చేసినట్లు తెలిపారు. రూ.21 వేలతో నూతన సైకిల్‌తోపాటు 40 కిలోమీటర్లు ప్రయాణించే సైకిల్‌ను త్వరలో తయారు చేస్తానని చెప్పారు. మధ్య వయసున్న పేద, మధ్యతరగతి వారు ఈ సైకిల్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
(చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ)