aca funds
-
కురుపానికి నిధుల వరద పారింది
గత తెలుగుదేశం పాలనలో అన్నింటా నిర్లక్ష్యానికి గురైన కురుపాం నియోజకవర్గానికి నిధుల వరద పారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి చొరవతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఏసీఏ నిధులు రూ.1.95కోట్లు మంజూరు చేశారు. వీటితో తాగు, సాగు, రహదారుల పనులు చేపట్టనున్నారు. సాక్షి, జియ్యమ్మవలస(విజయనగరం) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి చొరవతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాం నియోజకవర్గానికి కలెక్టర్ భారీగా అదనపు కేంద్ర సహాయక నిధులు (ఏసీఏ) మంజూరయ్యాయి. ఈ మేరకు కోటి 94 లక్షల 96వేల రూపాయిలు ఏసీఏ నిధులు మంజూరు చేసినట్టు కలెక్టర్ నుంచి కాపీ అందినట్టు మంత్రి పుష్పశ్రీవాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాగునీటికి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పార్వతీపురం వారి నుంచి 39 పనులకు మంజూరు అనుమతులు వచ్చినట్టు పేర్కొన్నారు. మంజూరైన నిధుల వివరాలను పరిశీలిస్తే... కొమరాడ మండలంలో శివిని గ్రామంలో ఎస్సీ కాలనీకి రూ.4లక్షలు, కోటిపాం పంచాయతీ గదబవలసకు రూ.2.50 లక్షలు, దేవకోన గ్రామానికి రూ.3లక్షలు, పాలెం పంచాయతీ పూజారిగూడకు రూ.3లక్షలు, సీహెచ్ గంగరేగువలసకు రూ.5లక్షలు, కొరిసిల గ్రామానికి రూ.3లక్షలు, మసిమండకు రూ.3లక్షలు, అర్తాం పంచాయతీ సీతమాంబపురానికి రూ.75వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. సీసీ రోడ్లు, కాలువ పనులకు కళ్లికోట గ్రామానికి రూ.4.99లక్షలు, మసిమండ పంచాయతీ బల్లపాడు గ్రామానికి రూ.4.99లక్షలు, పెదశాఖ పంచాయతీ చినశాఖకు రూ.4.99లక్షలు మంజూరయ్యాయి. జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట పంచాయతీ గవరమ్మపేట కాలనీకి రూ.1.50 లక్షలు, గడసింగుపురం పంచాయతీ ఏనుగులగూడకు రూ.2.50 లక్షలు, బల్లేరుగూడకు రూ.2.50లక్షలు, కుందరతిరువాడ పంచాయతీ నీచుకవలసకు రూ.రూ.5లక్షలు, పిప్పలబద్ర పంచాయతీకి రూ.4.50లక్షలు, పిప్పలబద్ర బీసీ కాలనీకి రూ.4లక్షలు, చినమేరంగి పీడబ్ల్యూఎస్ స్కీం మరమ్మతు పనులకు రూ.3లక్షలు, తుంబలి పంచాయతీ పందులవానివలస గ్రామానికి రూ.1.50లక్షలు, చినమేరంగి ఎస్సీ కాలనీ(పీడబ్ల్యూఎస్) తాగునీటి పథకం మరమ్మతులకు రూ.2లక్షలు మంజూరు అయ్యాయి. సీసీ రోడ్లు, కాలువ పనులకు పెదతోలుమండకు రూ.4.99లక్షలు, పెదదోడిజ గ్రామానికి రూ.4.99 లక్షలు మంజూరయ్యాయి. కురుపాం మండలానికి తాగునీరు పనులు బియ్యాలవలస పంచాయతీ దిమిటిగూడ గ్రామానికి రూ.1.50లక్షలు, గుజ్జువాయి పంచాయతీ వూటచవకగూడ, మరుపల్లి పంచాయతీ వంతరగూడ, మొండెంఖల్ పంచాయతీ మంగళగిరి గ్రామాలకు రూ.2లక్షలు చొప్పున, నీలకంఠాపురం పంచాయతీ కేదారిగూడ గ్రామానికి రూ.1.50లక్షలు, చుక్కుగడిగూడ గ్రామానికి రూ.2లక్షలు, కుంబుమానుగూడ గ్రామానికి రూ.2లక్షలు, నీలకంఠాపురం ఇందిరమ్మ కాలనీకి రూ.3లక్షలు, పెదగొత్తిలి పంచాయతీ జగ్గన్నదొరవలస, కొలిస గ్రామాలకు రూ.2లక్షలు చొప్పున మంజూరు చేశారు. పొడి పంచాయతీ రాజీపేట(తచ్చిడి)కురూ.2లక్షలు, తిత్తిరి పంచాయతీ సీడిగూడ గ్రామానికి రూ.2.50లక్షలు, వలసబల్లేరు పంచాయతీ బండిమానుగూడ గ్రామానికి రూ.1.50లక్షలు మంజూరయ్యాయి. సీసీ రోడ్లు, కాలువలకు మొండెంఖల్లు బస్టాప్ వరకు రూ.4.99 లక్షలు, టీజీ రోడ్డు నుంచి గాంధీనగర్ కాలనీ కురుపాం చివర వరకు రూ.4.99 లక్షలు, దండుసూరకు రూ.4.99 లక్షలు మంజూరు చేశారు. సాగునీటి పనుల కోసం గుజ్జువాయి రిజర్వాయరు పనులకు రూ.20 లక్షలు,గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం పంచాయతీ జోబుగూడకు రూ.3లక్షలు, పీ.ఆమిటి కాలనీకి రూ.3లక్షలు, ఎన్‌ఎన్‌పేట కాలనీకి రూ.2.50లక్షలు, చెముడుగూడ పంచాయతీ మసిడిగూడకు రూ.3లక్షలు, దుడ్డుఖల్లు పంచాయతీ కిల్లిగూడకు రూ.2.50లక్షలు, ఎల్విన్‌పేట పంచాయతీ పీబీ కాలనీకి రూ.3లక్షలు, గుమ్మలక్ష్మీపురం పంచాయతీ గడ్డికాలనీకి రూ.4లక్షలు, డుమ్మంగి పంచాయతీ కోరాటగూడకు రూ.3లక్షలు, ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్టీ కాలనీకి రూ.3లక్షలు తాగునీటికి మంజూరయ్యాయని తెలిపారు. సీసీ రోడ్ల కోసం కొండవీధి వయా మెట్టవీది టూ గడ్డి కాలనీకి రూ.4.99 లక్షలు, ఏపీఆర్ఎస్ పాఠశాల నుంచి ఆర్‌ఆండ్‌బీ రోడ్డుకు రూ.4.99 లక్షలు మంజూరు చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి చెక్‌డ్యాం పనులకు రూ.10లక్షలు, మురడగెడ్డ పనులకు రూ.6లక్షలు, సీమలగూడ ఆనకట్ట పనులకు రూ.6లక్షలు మంజూరు చేసినట్టు పుష్పశ్రీవాణి తెలిపారు. -
వారు ఆడిందే ‘ఆట’
జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో నాటౌట్ బ్యాట్స్మెన్లు ఏళ్లుగా ఒకే పదవిలో కొనసాగుతున్న పెద్దలు లోథా కమిటీ సిఫారసులూ బుట్టదాఖలు ఇష్టారాజ్యంగా ఏసీఏ నిధుల వినియోగం ఏకపక్ష సెలక్షన్స్‌తో నష్టపోతున్న ప్రతిభావంతులు జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను కొందరు పెద్దలు ఏళ్లుగా తిష్టవేశారు. ఆంధ్ర క్రికెట్ (ఏసీఏ) నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. ప్రతిభను పక్కనపెట్టి తమకు అనుకూలమైన వారినే సెలక్షన్ చేస్తుండడంతో ప్రతిభావంతులు నష్టపోతున్నారు. జనవరి 1 నుంచి లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చినా వారు మాత్రం తామెప్పటికీ నాటౌట్ బ్యాట్స్మెన్లమే నంటూ గ్రౌండ్ వీడడం లేదు. - అనంతపురం సప్తగిరి సర్కిల్: క్రికెట్... మనదేశంలో ఈ క్రీడ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. రంజీకి సెలక్టయినా అటు డబ్బు..ఇటు పేరు వస్తుంది. అందుకే క్రీడాకారులంతా క్రికెట్‌ను ఎంచుకుని తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటారు. క్రికెట్‌కు ఉన్న ఈ క్రేజ్ చూసే క్రీడా సంఘాలూ పుట్టుకువచ్చాయి. ఇపుడు అవే పెత్తనం చేస్తున్నాయి. తాము ఆడిందే ఆటగా నడుచుకుంటున్నాయి. క్రీనీడకు లోథా బ్రేక్ ఐపీఎల్ సందర్భంగా తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు దేశంలో ఏర్పాటు చేయబడిన కమిటీ లోథాకమిటీ క్రికెట్ అసోసియేషన్లకు సంబంధించి పలు సూచనలు చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి లోథా కమిటీ సిఫారసులు అమలు చేయాలని తీర్పు చెప్పింది. లోథా కమిటీ ఏం చెప్పిందంటే -ఒక వ్యక్తి రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష, కార్యదర్శి పదవిని చేపట్టడానికి వీల్లేదు. - ఏ పదవిలో అయినా ఆరేళ్ల మించి ఉండకూడదు. - క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఏ ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగిగా ఉండకూడదు కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)కు అనుబంధంగా పనిచేస్తున్న అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(ఏడీసీఏ) దీన్ని లోథా కమిటీ సిఫారసులు ఏమాత్రం లెక్కచేయడం లేదు. ప్రస్తుతం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాంచో ఫెర్రర్ 2004 నుంచి 12 ఏళ్లుగా ఆ పదిలో ఉన్నారు. ఆయనతోపాటు కార్యదర్శి పదవి కూడా ఇదే తీరుగా సాగుతుండగా ఈ ఏడాది మేలో నూతన కార్యదర్శిగా కేఎస్ షాహబుద్దీన్‌ను ఎంపిక చేశారు. దీంతోపాటు ఈ సంఘంలోని ఇతర సభ్యులు ఏళ్ల తరబడి అదే కేడెర్లో ఉంటూ తమ ఆధిపత్యాన్ని సాగిస్తున్నారు. దీంతో ప్రతిభ కలిగిన ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్‌కు దూరమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏడీసీఏలో చాలా మంది ఏళ్లుగా పాతుకుపోవడాన్ని జిల్లాలోని పలువురు సీనియర్ క్రికెటర్లు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. జిల్లాకు ప్రాతినిథ్యం వహించి... జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడిన చాలామంది సీనియర్ క్రీడాకారులు ఉన్నారనీ, వారిని కాదని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి ఆధిపత్యం చలాయించడం పట్ల వారు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా క్రికెట్ సంఘాన్ని ప్రక్షాళన చేసి... కొత్తవారిని తీసుకుంటే క్రికెటర్లకు మేలు జరుగుతుందని పలువురు సీనియర్ క్రికెట్ క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. అంతా ఆర్డీటీ కనుసన్నల్లోనే... జిల్లాలో క్రికెట్‌కు సంబంధించిన ప్రతి అంశం ఆర్డీటీ సంస్థ కనుసన్నల్లో సాగుతోంది. ఏడీసీఏ కార్యాలయాన్ని ఆర్డీటీ ప్రధాన క్రీడా మైదానంలోనే ఏర్పాటు చేశారు. ఏసీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆరుగురు కోచ్‌లు, ఒక ఫిట్నెస్ ట్రైనర్‌కు ఏసీఏ జీతాలను అందించినా... వారు మాత్రం ఆర్డీటీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ఆర్డీటీ సంస్థ తన సొంత నిధులను వెచ్చించి మరో 23 మందిని నియామకం చేసుకుని జీతాలు చెల్లిస్తోంది. జిల్లాలో ఎలాంటి సెలెక్షన్ నిర్వహించాలన్నా... క్రికెట్ సమావేశం నిర్వహించాలన్నా.... ఆర్డీటీ ఆధ్వర్యంలో సాగుతుంది. వారి ప్రమేయం లేకుండా ఎలాంటి చర్యలు జిల్లాలో తీసుకోలేని పరిస్థితి తలెత్తింది. ఏసీఏ అందించిన సామగ్రిని సైతం ఆర్డీటీ క్రీడా మైదానంలో వినియోగించుకుంటున్నారని సీనియర్ క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. స్టేడియం మంజురైనా... ధర్మవరం ప్రాంతంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పదేళ్ల క్రితం నివేదిక అందించారు. దీనికి అప్పట్లో జిల్లా కలెక్టర్ స్థలాన్ని కూడా పరిశీలించారు. అన్ని తతంగాలు పూర్తయిన తర్వాత ఫైలు ఏసీఏకు చేరింది. అయితే జిల్లా క్రికెట్ సంఘం నుంచే ఫైలును పంపించాలని ఏసీఏ తనకు అందిన ఫైలును వెనక్కు పంపింది. కానీ జిల్లా క్రికెట్ సంఘం ధర్మవరం స్టేడియం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కొందరు పెద్దలు కావాలనే స్టేడియం నిర్మాణానికి అడ్డుపడ్డారని క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.