Activa scooter model
-
పండక్కి వచ్చేస్తోంది... సరికొత్త రూపంలో హోండా యాక్టివా!
స్కూటర్ విభాగానికి యాక్టివా రూపంలో పవర్‌ని పరిచయం చేసిన హోండా సంస్థ పండక్కి కొత్త కబురు చెప్పేందుకు రెడీ అయ్యింది. సక్సెస్ ఫుల్ మోడల్ యాక్టివాతో పాటు డియో నుంచి కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు మార్కెట్లోకి తేబోతుంది. పండక్కి రిలీజ్ ఇటీవల హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తమ కంపెనీ రాబోతున్న కొత్త మోడళ్లకు సంబంధించి డాక్యుమెంట్లను ఆర్టీఏ కార్యాలయం ఢిల్లీలో సమర్పించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నట్టు పేర్కొంది. రాబోయే పండగ సీజన్లోనే ఈ కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎల్ఈడీ సొబగులు హోండా యాక్టివాకు సంబంధించి మార్కెట్లో ప్రస్తుతం 5జీ వెర్షన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా తాజాగా 6జీ వెర్షన్‌ను తెచ్చేందుకు హోండా సిద్ధమైంది. హోండా 6జీ, హోండా 6జీ ఎల్ఈడీ వెర్షన్లలో రెండు స్కూటర్లు మార్కెట్లోకి రాబోతున్నట్టు హోండా డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం హోండా యాక్టివాకు స్టీల్ వీల్స్ ఉండగా 6జీ నుంచి ఎల్లాయ్ వీల్స్‌ని పరిచయం చేయనుంది. డియో నాలుగు వెర్షన్లలో యాక్టివాతో పాటు హోండా డియోకు సంబంధించి మొత్తం 4 వెర్షన్లను మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇందులో కాంపోజిట్కాస్ట్ వీల్స్, డిజిటల్ స్పీడోమీటర్, కాంపోసిట్కాస్ట్వీల్స్, 3డి ఎంబ్లెమ్ వేరియంట్లలో మార్కెట్లోకి తేబోతున్నట్టు తెలుస్తోంది. 110 సీసీ హోండా త్వరలో మార్కెట్లోకి తేబోతున్న 6జీ యాక్టివా, డియో మోడల్స్ రెండింటి ఇంజన్ సామర్థ్యం 109.51 సీసీ సింగిల్ సిలిండర్‌గా ఉంది. యాక్టివా 5జీ 7.68 హెచ్పీతో 8,000 ఆర్పీఎం శక్తిని విడుదల చేయనుంది. ఇక డియోకు సంబంధించి 7.65 హెచ్పీతో 8,000 ఆర్‌పీఎంని రిలీజ్ చేస్తుంది. చదవండి : పలు కార్లపై బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన హోండా..! -
హోండా యాక్టివాలో కొత్త వేరియంట్
ఏడాదికి 50 లక్షల టూవీలర్లు విక్రయించడం లక్ష్యం * హోండా సీఈఓ మురమత్సు న్యూఢిల్లీ : హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కంపెనీ యాక్టివా స్కూటర్ మోడల్లో కొత్త వేరియంట్‌ను బుధవారం ఆవిష్కరించింది. ధర రూ.48,852గా నిర్ణయించి నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. దీంతో పాటు మరో 5 కొత్త మోడళ్లను కంపెనీ ఆవిష్కరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 కొత్త మోడళ్లను తెస్తామని, ఏడాదికి 50 లక్షల టూవీలర్లను విక్రయించడం లక్ష్యమని మురమత్సు తెలియజేశారు. తమ అంతర్జాతీయ మోటార్ బైక్‌ల విక్రయాల్లో భారత్ వాటా 25 శాతమని, ఈ ఆర్థిక సంవత్సరం జనవరిదాకా 36,92,374 టూవీలర్లను విక్రయించామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ ఎస్. గులేరియా చెప్పారు. రూ.1,000 కోట్లతో గుజరాత్లో తమ కంపెనీ నాలుగో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్లాంట్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో, డియో స్కూటర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను, కొత్త సీబీ షైన్ మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి తెస్తామని వివరించారు.