చెత్తను చితకేయండి
ఇంట్లో చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారం. ఇంట్లో డస్ట్బిన్లు ఉంటాయి. ఒక్కోసారి చెత్త వాటికి మించే ఉంటుంది. చెత్త తీసుకుపోయే మునిసిపాలిటీ బళ్లు రెండు మూడు రోజులు రాలేదంటే ఇక ఆ బాధ చెప్పనలవి కాదు. ఇంట్లోను, వంటింట్లోను అంతకంతకు చెత్త పరిమాణం పెరగడమే కాదు, చెత్త చుట్టూ దోమలు, ఈగలు, బొద్దింకల వంటి జీవుల సంచారం కూడా విపరీతంగా పెరుగుతుంది. వాటి ధాటికి నానా రోగాలూ చుట్టుముడతాయి. ఇలాంటి చెత్త సమస్యకు పరిష్కారమే ఈ ‘కిచెన్ ఎయిడ్’ ట్రాష్ కాంపాక్టర్.
మామూలుగా ఐదు చెత్త సంచుల్లో పట్టేంత చెత్తను ఇందులో వేస్తే, క్షణాల్లోనే అది ఒక సంచిలో పట్టేంతగా కుదించుకుపోతుంది. ఎలాంటి చెత్తనైనా ఇది క్షణాల్లోనే నజ్జు నజ్జు చేసేస్తుంది. ఇందులోని ‘ఆడర్ మేనేజ్మెంట్ సిస్టమ్’ పనితీరు వల్ల చెత్త నుంచి దుర్గంధం కూడా వెలువడకుండా ఉంటుంది. ఇళ్లల్లోని చెత్త సమస్యకు చెక్ పెట్టాలంటే, ఇలాంటి పరికరం ఉండాల్సిందే!