Agri Funds Project
-
అగ్రిటెక్ స్టార్టప్‌లకు బూస్ట్
న్యూఢిల్లీ: అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రూ.750 కోట్ల ఫండ్ ‘అగ్రిష్యూర్’ను ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగం పురోగతి లక్ష్యంగా దాదాపు రూ.14,000 కోట్లతో ఏడు పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ‘అగ్రిష్యూర్’ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...రూ.750 కోట్ల ‘అగ్రిష్యూర్’ (స్టార్టప్‌లు, రూరల్ ఎంటర్ప్రైజెస్) ఫండ్ ఈక్విటీ అలాగే డెట్ క్యాపిటల్ రెండింటినీ అందించడం ద్వారా స్టార్టప్‌లు, ‘అగ్రిప్రెన్యూర్’లకు మద్దతు ఇస్తుంది.స్టార్టప్‌లు ఈ నిధిని వినియోగించుకోవాలి. వ్యవసాయ రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఎటువంటి నిధుల కొరతనూ ఎదుర్కోకుండా తగిన చర్యలు తీసుకుంటారు.గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించింది. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఈ రంగం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 18 శాతం వాటాను కలిగి ఉంది. రైతులు అతిపెద్ద ఉత్పత్తిదారులు మాత్రమే కాకుండా అతిపెద్ద వినియోగదారులు కూడా అన్న విషయాన్ని గమనించాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన పరోక్ష సహకారం.రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు ఆహారం, పౌష్టికాహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.ఉత్పత్తి పెంపు, ముడి పదార్థాల వ్యయం తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు, పంటల వైవిధ్యం, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్రం దృష్టి సారించింది. ఎరువులపై కేంద్రం భారీ రాయితీలూ కల్పిస్తోంది.వ్యవసాయ రంగానికి కొత్త ప్రయోగాలు అవసరం. చిన్న రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయం చేసేందుకు గ్రూపులుగా ఏర్పడే అంశాన్ని వారు పరిశీలించాలి. మితిమీరిన రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకం మంచిది కాదు. సాగునేలను సారవంతమైనదిగా కొనసాగించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏఐఎఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) కింద వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకులు, రాష్ట్రాలకు వారి కృషిని గుర్తింపుగా వ్యవసాయ మంత్రి ఏఐఎఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ఈ సందర్భంగా అందజేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవార్డులు అందుకోగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రైవేట్ రంగ బ్యాంకుగా అవార్డును స్వీకరించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విభాగంలో బరోడా రాజస్థాన్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్, పంజాబ్ గ్రామీణ బ్యాంక్, బరోడా యూపీ గ్రామీణ బ్యాంక్, మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్, సర్వ హరియాణా గ్రామీణ బ్యాంక్ ఉత్తమ పనితీరుకు అవార్డులు అందుకున్నాయి. అత్యుత్తమ పనితీరు కనబరిచి, అవార్డులను అందుకున్న రాష్ట్రాలలో తెలంగాణసహా మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!‘కృషినివేష్’ పోర్టల్ ఆవిష్కరణ..‘కృషినివేష్’ పేరుతో ఇంటిగ్రేటెడ్ అగ్రి ఇన్వెస్ట్మెంట్ పోర్టల్‌ను కూడా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ పోర్టల్ పెట్టుబడి అవకాశాలు సంబంధిత వ్యవసాయ సమాచారాన్ని కేంద్రీకరించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మార్చగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ వ్యాపారాలను మెరుగుపరచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వేదికే ఈ పోర్టల్ అని ఆయన అభివర్ణించారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి సంబంధించి రైతులు, పారిశ్రామికవేత్తలు, ఈ రంగంలోని విభిన్న వాటాదారులకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చౌహాన్ తెలిపారు. -
ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...: ►వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచేలా చూడాలి ►దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుంది ►ధరల విషయంలో రైతులకు ఎక్కడ నిరాశాజనక పరిస్థితులు ఉన్నా వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవాలి ►ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలి ►ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలన్న సీఎం ►అలాగే ఆర్బీకేల పనితీరును దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారు ►నాణ్యత ఉన్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు మంచి ధరలకే లభిస్తున్నాయి ►బయట మార్కెట్లో డీలర్ అమ్మే రేట్లకన్నా తక్కువ రేట్లకే లభిస్తున్నాయి ►రేట్లలో మోసం లేదు, క్వాలిటీలో మోసం లేదు : ►దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం ►ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్లను ప్లేస్‌చేయగానే వాటిని వారికి అందించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ►అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకున్నాం ►దీంట్లో భాగంగా పొటాష్‌ను కూడా తెప్పించుకున్నాం ►ఇలాంటి ఆర్బీకేలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు ►ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్, ఫీడ్, ఎరువులు రైతులకు అందుబాటులోకి రావడం వారికి ఇష్టం లేనట్టుంది ►అధిక ధరల్లో రైతులు చిక్కుకోవాలని, ఎరువులకోసం, విత్తనాల కోసం అప్పులు చేసి వడ్డీలు మీద వడ్డీలు చెల్లించే పరిస్థితులే కొనసాగాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది: ►ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్టవేస్తూ ఆర్బీకేలను తీసుకురావడం, వాటి ద్వారా రైతుల ముంగిటకే సేవలు అందించడం వారికి నచ్చడం లేదు సబ్ డీలర్లుగా ఆర్బీకేలు... ►మరో అడుగు ముందుకేసి ఆర్బీకేలను సబ్‌డీలర్లుగా మార్పు చేస్తున్నామన్న అధికారులు ►వచ్చే రబీ సీజన్‌నుంచి ఇది అమల్లోకి వస్తోందన్న అధికారులు ►రైతులకు మరింత మేలు జరుగుతుందన్న అధికారులు ►వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న సీఎం బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు ►బోర్ల కింద వరిని సాగుచేసే చోట ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: సీఎం ►మిల్లెట్స్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగును ప్రోత్సహించాలన్న సీఎం ►ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి: సీఎం ►ఇలాంటి చోట ప్రాససింగ్ ప్లాంట్లు కూడా పెట్టాలి: సీఎం ►తద్వారా రైతులకు అండగా నిలబడగలుగుతామన్న సీఎం ►33 చోట్ల సీడ్ కమ్ మిల్లెట్ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన అధికారులు ►ఈ డిసెంబరు నాటికి 20 యూనిట్లు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు ►33 యూనిట్లను మార్చి 2022 కల్లా పూర్తి చేయడానికి లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్న అధికారులు ►వచ్చే ఖరీప్‌నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్న అధికారులు జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపైనా సీఎం సమీక్ష ►బీఎంసీల నిర్మాణంపై వివరాలు అందించిన అధికారులు ►ప్రాధాన్యతా క్రమంలో గుర్తించిన బీఎంసీలను డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు ►జగనన్న పాలవెల్లువ కార్యక్రమం చేపట్టిన జిల్లాల్లో పాల సేకరణ అంతకంతకూ పెరుగుతోందన్న అధికారులు ►రైతులకు మేలు చేస్తున్న ఈ కార్యక్రమంపైనా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు: సీఎం ►అమూల్ అన్నది ప్రైవేటు సంస్థకాదు: సీఎం ►అది పెద్ద సహకార ఉద్యమం : ►పాలుపోసే రైతులే ఈ సంస్థకు యజమానులు : సీఎం లాభాలన్నీ తిరిగి రైతులకే : ►ఇలాంటి కార్యక్రమంపైనా విషప్రచారానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు : సీఎం ►అమూల్ వచ్చాక పాల సేకరణధరలు పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయి : ►దీనివల్ల రైతులకు మేలు జరుగుతోంది: ►పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లపై వివరాలడిగిన సీఎం ►ఇప్పటివరకు జరిగిన ప్రగతిని నివేదించిన అధికారులు ►పుడ్ ప్రాససింగ్ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్న సీఎం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపైనా సీఎం సమీక్ష ►జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో పనులు జరగుతున్నాయన్న అధికారులు ►జులైలో పనులు దాదాపుగా పూర్తవుతాయన్న అధికారులు ►మిగిలిన ఐదు ఫిషింగ్ హార్బర్ల పనులపైనా దృష్టిపెట్టాలన్న సీఎం ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాల కొండయ్య, వ్యవసాయ మార్కెటింగ్ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి, పుడ్ ప్రాససింగ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీడీడీసీఎఫ్ లిమిటెడ్ ఎండీ ఎ బాబు, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ పి ఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, ఉద్యానవనశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ శ్రీధర్, సీడ్స్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి శేఖర్ బాబు, మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (చరిత్ర ఎరుగని 'ఆసరా' ఇది)