‘ఆ ఎంపీపై చర్య తీసుకోవాలి’
కమలాపురం: అభ్యంతరకరంగా మాట్లాడిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అహోబల రామానుజ జీయర్‌స్వామి సూచించారు. భరతమాతను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని తెలిపారు. గురువారం ఆయన వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం రామాపురంలో విలేకరులతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.