Ahuti prasad funeral
-
రేపు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు
-
రేపు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు
హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎర్రగడ్డ శ్మశాన వాటికలో చేస్తారు. కేన్సర్‌తో ఆదివారం మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రిలో మరణించిన ఆహుతి ప్రసాద్ భౌతికకాయాన్ని కాసేపట్లో ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలిస్తారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్లో ఉంచుతారు. అనంతరం ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.