air crashes
-
నేపాల్ విమాన ఘటన: కోపైలట్ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..
నేపాల్ విమాన ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడక పోవడం అందర్నీ తీవ్రంగా కలిచి వేసింది. ఐతే ఈ ఘటనలో చనిపోయిన కో పైలెట్ అంజు ఖతివాడ విషాద గాథ అందర్నీ కంటతడి పెట్టేలా చేసింది. ఆమె 2006లో పైలట్ అయిన తన భర్తను ఇదే విమాన ప్రమాదంలో పోగొట్టకుంది. అయినా ఆ బాధను దిగమింగుకుని తన భర్త మాదిరిగా పైలట్ అవ్వాలని 2010లో ఎయిర్‌లైన్స్‌లో చేరింది. అందుకోసం ఎంతో ప్రయాసపడి ఏదోలా కో పైలట్ ఉద్యోగం సాధించింది. ఇంకా కొద్దిగంటల్లో పైలట్ అయిపోతుంది అనంగా ఈ ఘోర ప్రమాదం బారినపడింది. వాస్తవానికి నేపాల్ నిబంధనల ప్రకారం కోపైలట్ పైలట్ అవ్వాలంటే సుమారు 100 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉండాలి. అందులో భాగంగా ఈ ప్రమాదం జరిగిన యతి ఎయిర్‌లైన్స్ విమానంలో పయనించింది. ఈ మేరకు 72 మంది ప్రయాణికులతో వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్ ఏటీఆర్ 72 విమానానికి కమల్ కేసీ పైలట్‌గా ఉండగా..అంజు ఖతివాడ కో పైలట్‌గా వ్యవహరించారు. అంతేగాదు అంజుకి కోపైలట్‌గా ఇది చివరి విమానం. ఇప్పటివరకు అంజు నేపాల్‌లో ఉన్న అన్ని ఎయిర్‌పోర్ట్‌లో కోపైలట్‌గా.. విజయవంతంగా అన్ని విమానాలను ల్యాండ్ చేశారు. ఇంకొద్దిసేపులో తన కల నెరవేరుతుందనంగా విధికి ఆమెపై కన్నుకుట్టిందేమో! తెలియదుగానీ ఆమె కలల్ని కల్లలు చేస్తూ..ఆమెను చిదిమేసింది. నాడు అంజు భర్త 16 ఏళ్ల క్రితం ఇదే యతి ఎయిర్‌లైన్స్‌లో కోపైలట్ విధులు నిర్వర్తిస్తూ..ఎలాగైతే మరణించారో ఆమె కూడ అలానే మరణించడం బాధకరం. అంజు భర్త 2006లో కోపైలట్‌గా యతి ఎయిర్‌లైన్స్ విమానంలో ఉండగా.. నేపాల్‌గంజ్ నుంచి జుమ్లా వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. నాడు భర్త లాగే..నేడు భార్యను కూడా విధి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఐతే ఈ ఘటనలో పైలట్ కమల్ కేసి మృతదేహాన్ని గుర్తించామని, కానీ కోపైలట్ అంజు మృతదేహనికి సంబంధించిన అవశేషాలను ఇంకా గుర్తించలేదని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. ఇదిలా ఉండగా, ఆదివారం నేపాల్ యతి ఎయిర్‌లైన్స్ ఏటీఆర్-72 విమానం దుర్ఘటనలో విమానం కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందు అటు ఇట్లు దొర్లినట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. అలాగే విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవి క్రాష్ కావడానికి కారణమేమిటో గుర్తించడంలో సహాయపడవచ్చునని చెబుతున్నారు. (చదవండి: వీధి కుక్కులకి ఆహారం పెడుతుండగా..ర్యాష్‌గా దూసుకొచ్చిన కారు) -
నాలుగేళ్లలో 41 ఎయిర్ క్రాషెస్
న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో మిలిటరీకి సంబంధించి 41 గగనతల ప్రమాదాలు సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదాలకు గురైన వాటిలో విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయని, 65 మంది మృత్యువాత పడ్డారని చెప్పింది. అయితే, సామాన్య పౌరులెవరూ ఈ ప్రమాదాల కారణంగా చనిపోలేదని స్పష్టం చేసింది. లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖమంత్రి మనోహర్ పారికర్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అందులో 'ఏప్రిల్ 1, 2012 నుంచి జూలై 2016 మధ్య అంటే నాలుగేళ్లలో శిక్షణలో ఉన్న హెలికాప్టర్లు, విమాన ప్రమాదాలు 41 చోటుచేసుకున్నాయి. వీటివల్ల 65 మంది చనిపోయారు. ఇందులో వైమానిక విభాగానికి చెందిన ఎయిర్ క్రాష్ లు ఎక్కువగా (28) ఉన్నాయి. అలాగే పాదాతి దళానికి చెందిన హెలికాప్టర్ల ప్రమాదాలు ఏడు జరగగా.. నావికా దళానికి చెందిన ప్రమాదాలు నాలుగు జరిగాయి' అని ఆయన చెప్పారు.