Air lifting
-
ఇప్పటికే అమ్మా నాన్న పోయారు...మీరే దిక్కు: సోనూ స్పందన
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ నిమిత్తం ఒక రోగిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు ఆయన ట్విటర్ వివరాలను షేర్ చేశారు.బాధితుడి సోదరుడు ట్విటర్ ద్వారా చేసిన విజ్ఞప్తికి స్పందించిన సోనూ సూద్, ఆపరేషన్ ఖర్చును భరించడంతోపాటు, అతణ్ని ఆసుపత్రికి తరలించేందుకు రేపు(మంగళవారం) ఏర్పాటు చేసినట్టు సోమవారం ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రతీ భారతీయుడు ప్రార్థించాలని కూడా కోరారు. వివరాల్లోకివెళితూ.. హితేశ్ శర్మ(44) ఇటీవల కోవిడ్ బారిన పడ్డారు. యూపీ, నోయిడాలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న ఆయన లంగ్స్ పూర్తిగా పాడై పోయాయి. ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు తేల్చేశారు. ఏప్రిల్ నుండి ఆసుపత్రిలో అతని చికిత్స కోసం ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టేశారు కుటుంబ సభ్యులు. 12 ఏళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్న హితేశ్‌కు కరోనా మహమ్మారితో ఇప్పటికే తన తల్లిదండ్రులు కన్నుమూసిన సంగతి తెలియదు. మరోవైపు హితేశ్‌ను బతికించుకోవాలంటే, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్, పోస్ట్ ట్రామా ట్రీట్మెంట్, రికవరీ, హాస్పిటల్ ఖర్చులు, ఇవన్నీ కలిపి సుమారు రూ .1,50,00,000 (ఒక కోటి యాభై లక్షలు) అవసరం. దీంతో ఎలాగైనా భర్తను హితేశ్‌ను రక్షించుకునేందుకు భార్య పూజ క్రౌడ్ ఫండింగ్‌కు ప్రయత్నించారు. అయినా తగినంత డొనేషన్స్ రాకపోవడంతో హితేశ్ సోదరుడు ట్విటర్ ద్వారా మరోసారి సోనూను ఆశ్రయించారు. ఇప్పటికే కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయాననీ, ఇపుడు సోదరుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని పేర్కొన్నాడు. సోదరుడిని కాపాడుకోలేక పోతే తానిక అనాధగా మిగిలిపోతాను.. సాయం చేయాలని వేడుకున్నాడు. .తనకున్న ఏకైక ఆశ మీరే అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సోనూ సూద్ వేగంగా స్పందించారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా హితేశ్‌ను హైదరాబాద్‌కు తరలించనున్నామంటూ ట్వీట్ చేయడం విశేషం. Let's save your brother.🤞 Air Ambulance ready to fly tomorrow✈️ Lung transplant lined up in Hyd. ✅ We just need prayers of every Indian.🙏@YashodaHospital@SoodFoundation 🇮🇳 https://t.co/JvLNua4clS — sonu sood (@SonuSood) July 12, 2021 -
‘అన్ని రిస్కులు తెలుసుకునే అమెరికాకు రండి’
న్యూయార్క్: కరోనా లాక్‌డౌన్‌తో భారత్‌లో చిక్కుకుపోయిన అమెరికన్లను తరలించేందుకు ఆ దేశం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈమేరకు అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు పంపిన మెయిల్ ప్రకారం తొలి చార్టర్డ్ ఫ్లైట్ శనివారం బయల్దేరి వెళ్లినట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో, ముంబై నుంచి అట్లాంటా మధ్య అమెరికా విమానాలు ఈ ప్రయాణం సాగిస్తాయి. ఢిల్లీలో ఉన్న 1500 మంది, ముంబైలో ఉన్న 600- 700 మంది, ఇతర ప్రాంతాలోన్న 300 నుంచి 400 మంది స్వదేశానికి రావడానికి ఆసక్తి చూపుతున్నారని అమెరికా హోంశాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఇయాన్ బ్రోన్‌లే పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లొద్దని, ఇతర దేశాల్లో ఉన్నవారు అమెరికాకు తిరిగా రావాలని మార్గదర్శకాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. (చదవండి: భారత్ సహాయాన్ని కోరిన ట్రంప్) ఎప్పటివరకు విమానాల రాకపోకలు కొనసాగుతాయో చెప్పలేమని, సాధ్యమైనంత త్వరగా భారత్‌లో ఉన్నవారు స్వదేశానికి వచ్చేయాలని అన్నారు. అయితే, అమెరికాలో ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుని, అన్ని రిస్కులు తెలుసుకుని వస్తే మంచిదని సూచించారు. అమెరికా పౌరులతో పాటు, యూఎస్ పౌరసత్వం కల్గినవారు, గ్రీన్ కార్డు హోల్డర్లు, వీసా హోల్డర్లు కూడా ప్రత్యేకంగా నడపనున్న విమనాల్లో రావొచ్చునని తెలిపారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఢిల్లీ, ముంబై చేరుకునేందుకు డొమెస్టిక్ విమానాలు, దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారి కోసం బస్సులు నడపడాలని భారత్‌ను కోరామని బ్రోన్‌లే తెలిపారు. ఇక విదేశాల్లో ఉన్నవారిని రప్పించేందుకు భారత్ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. (చదవండి: గుడ్‌న్యూస్: ఒక్క డోస్‌తో కోవిడ్-19 ఆట కట్టించొచ్చు!) -
నడిసముద్రంలో చిక్కుకున్న నౌక
ఓస్లో: నార్వేతీరంలోని సముద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ఆదివారం కూడా కొనసాగాయి. ఇప్పటివరకు 397 మంది ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వారా తరలించారు. దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ట్రోంసో నుంచి స్టావంగర్‌కు వెళ్తున్న విలాసవంతమైన ఓడలో 1,373 మంది ఉన్నారు. శనివారం ఓడలోని ఇంజిన్లలో సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. కెప్టెన్ అప్రమత్తమై అధికారులకు సమాచారమిచ్చారు. ప్రయాణికులను సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అధికారులు హెలికాప్టర్లు పంపారు. ఇప్పటిదాకా 397 మందిని తరలించారు. బలమైన గాలులు వీస్తున్నా, ప్రమాదకర వాతావరణపరిస్థితులు ఉన్నా హెలికాప్టర్ ద్వారా ప్రయాణికుల చేరవేత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఓడలోని నాలుగు ఇంజిన్లలో మూడింటిని సిబ్బంది మరమ్మతు చేశారు. ఓస్లోకు వాయవ్య దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోల్డె పోర్టుకు ప్రయాణికుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. లైఫ్ జాకెట్లతో నౌకలో బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు -
బలహీనపడుతున్న లెహర్ అయినా అలర్ట
=దిశ మార్చుకున్న తుపాను =మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం =ఇంకా ప్రమాదం పొంచిఉంది: కలెక్టర్ =నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : లెహర్ తుపాను దిశమారినప్పటికీ జిల్లాకు ముప్పు పొంచి ఉంది. మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నా..దాని ప్రభావం విశాఖపై కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దాని ఛాయలు కనిపించనప్పటికీ గురువారం తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 180 నుంచి 200 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. ఈమేరకు అధికారులు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ లిఫ్టింగ్ కోసం రెండు హెలికాప్టర్లను కూడా రప్పించారు. గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మండలాలకు బృందాలు : తుపాను ప్రభావ మండలాలకు నియమించిన జిల్లా స్థాయి ప్రత్యేకాధికారులతో పాటు మండల స్థాయి అధికారులు గ్రామాల్లోనే ఉన్నారు. జిల్లాకు వచ్చిన ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మండల కేంద్రాలకు చేరుకున్నాయి. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను గమనిస్తున్నాయి. అధికారులు గ్రామస్తులతో మాట్లాడి లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. 120 మందితో కూడిన ఆర్మీ బృందం గురువారం తెల్లవారుజామున జిల్లాకు చేరుకోనుంది. వీరితో పాటు 20 నావికాదళ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అగ్నిమాపక శాఖకు చెందిన 20 బృందాలు కూడా మండలాల్లో మకాం వేశాయి. పునరావాస కేంద్రాలకు ససేమిరా : లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో 55 గ్రామాలను తరలించాలని అధికారులు భావించారు. బుధవారం నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రయత్నించారు. అయితే జనం కేంద్రాలకు వెళ్లడానికి అంగీకరించలేదు. ప్రస్తుతం పరిస్థితులు కూడా అంత ప్రమాదకరంగా లేకపోవడంతో అధికారులు కూడా ప్రజలపై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఏ మాత్రం వర్షాలు పడినా వెంటనే వారినితరలించడానికి వీలుగా వాహనాలను కూడా సిద్ధం చేశారు. వెళ్లని వారిని బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. అధికారులు హెచ్చరించినా కొందరు మత్స్యకారులు బుధవారం వేటకు వెళ్లారు. ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోట్లు చాలా వరకు తిరిగి వచ్చినప్పటికీ ఇంకా 40 బోట్లు రావాల్సి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా బోట్ల యాజమాన్యాలతో అధికారులు మాట్లాడి వాటిని వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష గోనె సంచెల్చు : ఇటీవల వచ్చిన వరదలకు మూడు రిజర్వాయర్ల పరిధిలో గట్లకు గండ్లు పడ్డాయి. వాటికి ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. లెహర్ తుపాను కారణంగా భారీ వర్షాలు సంభవిస్తే మరోసారి గండ్లు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశాల మేరకు అధికారులు లక్ష గోనె సంచులను కొనుగోలు చేశారు. వాటిని జిల్లాలోని అయిదు నీటి పారుదల శాఖ సర్కిళ్లకు పంపారు.