పబ్ యజమానులకు జైలు శిక్ష
అర్థరాత్రి దాటినా పబ్ నడిపినందుకు జూబ్లీ హిల్స్ ఎయిర్ పబ్ యజమానులకు కోర్టు జైలు శిక్ష విధించింది. పబ్ నిర్వాహకులు అనిరుధ్ అగర్వాల్, మయాంక్ అగర్వాల్ లకు కోర్టు 6 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. గతంలో 3 సార్లు కేసులు నమోదు చేసినా తీరు మార్చుకోక పోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.