ఎస్బీహెచ్ ఎదుట భారీ ధర్నా
తిరుపతి: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ముద్రించిన రూ. 2 వేల రూపాయల నోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. పెద్ద నోట్లతో తిప్పలు పడుతున్న ప్రజలకు వందనోట్లు అందించాలని.. ఏటీఎంలు 24 గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తిరుపతిలోని ఎస్బీహెచ్ ఎదుట బుధవారం ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.