Akashdeep Singh
-
ఆకాశ్‌దీప్ హ్యాట్రిక్ వృథా.. ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి
IND VS AUS Hockey Test Series: ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత పురుషుల జట్టు ఓటమితో ప్రారంభించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–5 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. భారత స్టార్ ప్లేయర్ ఆకాశ్‌దీప్ సింగ్ (10వ, 27వ, 59వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించినా ఫలితం లేకపోయింది. మరో గోల్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (31వ ని.లో) అందించాడు. ఆ్రస్టేలియా తరఫున లాచ్లాన్ షార్ప్ (5వ ని.లో), నాథన్ ఇఫారౌమ్స్ (21వ ని.లో), టామ్ క్రెయిగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... బ్లేక్ గోవర్స్ (57వ, 60వ ని.లో) రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
ఆకాశ్‌దీప్‌కు రూ.55 లక్షలు
సర్దార్ సింగ్‌కు నిరాశ హాకీ ఇండియా లీగ్ ఆటగాళ్ల వేలం న్యూఢిల్లీ : హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఆటగాళ్ల వేలంలో యువ స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్‌కు భారీ ధర పలికింది. అయితే భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్‌పై ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తి కనబరచకపోవడం ఆశ్చర్యపరిచింది. వచ్చే సీజన్ కోసం శుక్రవారం జరిగిన ఈ వేలంలో ఆకాశ్‌దీప్‌ను ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్ 84 వేల డాలర్ల (రూ.55,56,247)కు కొనుగోలు చేసింది. భారత ఆటగాళ్లలో అత్యధిక మొత్తం ఆకాశ్‌కే దక్కింది. ఆ తర్వాత స్థానంలో 81 వేల డాలర్ల(రూ.53,57,578) ధరతో సీనియర్ డ్రాగ్‌ఫ్లికర్ సందీప్ సింగ్ (రాంచీ రేస్), గుర్మైల్ సింగ్ (దబాంగ్ ముంబై) నిలిచారు. మరోవైపు ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఈ ఏడాది వదులుకున్న సర్దార్ సింగ్‌ను 58 వేల డాలర్ల (రూ. 38,36,290) తక్కువ మొత్తంతో పంజాబ్ వారి యర్స్ తీసుకుంది. ఓవరాల్‌గా జర్మనీ స్టార్ ఆటగాడు మోరిట్జ్ ఫ్యుయర్‌స్టే టాప్‌లో నిలిచాడు. కళింగ లాన్సర్స్ ఈ ఆటగాడిని లక్షా 5 వేల డాలర్ల (రూ.69,46,289)కు తీసుకుంది. -
భారత్ హ్యాట్రిక్
జపాన్‌తో హాకీ సిరీస్ భువనేశ్వర్ : మ్యాచ్ మ్యాచ్‌కూ పురోగతి సాధించిన భారత హాకీ జట్టు జపాన్‌తో జరిగిన సిరీస్‌ను విజయంతో ముగించింది. సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్‌లో భారత్ 4-0 గోల్స్ తేడాతో జపాన్ను ఓడించింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా... రఘునాథ్, ధరమ్వీర్ సింగ్ ఒక్కో గోల్ అందించారు. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న సర్దార్ సింగ్ బృందం తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. గత మూడు మ్యాచ్‌ల్లో గట్టిపోటీనిచ్చిన జపాన్ ఈసారి మాత్రం తేలిపోయింది. తొలి క్వార్టర్లో గోల్ చేయడంలో విఫలమైన భారత్ ఆ తర్వాత జోరు పెంచింది. తొలి పెనాల్టీ కార్నర్‌ను వృథా చేసిన భారత్ 27వ నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాతి నిమిషంలోనే ఆకాశ్‌దీప్ భారత్‌కు రెండో గోల్‌ను అందించాడు. 37వ నిమిషంలో ధరమ్వీర్, 54వ నిమిషంలో ఆకాశ్‌దీప్ ఒక్కో గోల్ చేయడంతో భారత విజయం ఖాయమైంది.