జపాన్‌తో హాకీ సిరీస్
భువనేశ్వర్ : మ్యాచ్ మ్యాచ్‌కూ పురోగతి సాధించిన భారత హాకీ జట్టు జపాన్‌తో జరిగిన సిరీస్‌ను విజయంతో ముగించింది. సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్‌లో భారత్ 4-0 గోల్స్ తేడాతో జపాన్‌ను ఓడించింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా... రఘునాథ్, ధరమ్‌వీర్ సింగ్ ఒక్కో గోల్ అందించారు. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న సర్దార్ సింగ్ బృందం తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
గత మూడు మ్యాచ్‌ల్లో గట్టిపోటీనిచ్చిన జపాన్ ఈసారి మాత్రం తేలిపోయింది. తొలి క్వార్టర్‌లో గోల్ చేయడంలో విఫలమైన భారత్ ఆ తర్వాత జోరు పెంచింది. తొలి పెనాల్టీ కార్నర్‌ను వృథా చేసిన భారత్ 27వ నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాతి నిమిషంలోనే ఆకాశ్‌దీప్ భారత్‌కు రెండో గోల్‌ను అందించాడు. 37వ నిమిషంలో ధరమ్‌వీర్, 54వ నిమిషంలో ఆకాశ్‌దీప్ ఒక్కో గోల్ చేయడంతో భారత విజయం ఖాయమైంది.
భారత్ హ్యాట్రిక్
Published Sun, May 10 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM
Advertisement
Advertisement