Akbaruddin OWAISI ghmc election
-
కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విరుచుకుపడ్డారు. శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ కావాలనే రచ్చ చేస్తోందని ఆయన అన్నారు. ప్రతి సెషన్‌కు కాంగ్రెస్ మాటమార్చడం తగదని అక్బరుద్దీన్ హితవు పలికారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను అతిక్రమించవద్దని, సభను తప్పుదోవ పట్టించడం సరికాదని ఆయన అన్నారు. సమావేశాలు సజావుగా జరిగేలా కాంగ్రెస్ వ్యవహరించాలన్నారు. కాగా ...సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానానికి చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితేవాయిదా తీర్మానంపై డిప్యూటీ స్పీకర్ స్పందించకుండానే కాంగ్రెస్ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాలు పూర్తి కాగానే ఈ అంశంపై చర్చిద్దామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల తీరు చూస్తుంటే...సభలో ఉండి చర్చలో పాల్గొనడం కంటే...బయటకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారని హరీశ్ విమర్శించారు. జానారెడ్డి వంటి విజ్ఞులు కూడా ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. -
మారణకాండతోనే మోదీకి ప్రధాని పదవి
భోలక్‌పూర్ రోడ్ షోలో అక్బరుద్దీన్ ఒవైసీ కవాడిగూడ: గుజరాత్, మురదాబాద్‌లలో జరిగిన మా రణకాండతోనే నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి అయ్యారని ఎంఐఎం పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 65 ఏళ్లలో ముస్లింలకు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. భోలక్‌పూర్ డివిజన్లో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మహ్మద్ అఖిల్ అహ్మద్‌కు మద్దతుగా అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అమీర్‌ఖాన్‌ల కంటే మోదీ పెద్ద నటుడని వ్యాఖ్యానించారు. ఎంఐఎం అభ్యర్థిని గెలిపిస్తే సాలారేమిల్లత్లో మాది రిగా ఈ ప్రాంతీయులకు ప్రత్యేక ఆస్పత్రి, పాఠశాలను నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు సయ్యద్ ఫర్హాన్ సజ్దాద్, షరీఫుద్దీన్, సయ్యద్ మొహినుద్దీన్, జునైద్ బాగ్దాద్, కలీమ్, ఫర్వేజ్, ఖురేషీ తదితరులు పాల్గొన్నారు.