సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విరుచుకుపడ్డారు. శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ కావాలనే రచ్చ చేస్తోందని ఆయన అన్నారు. ప్రతి సెషన్‌కు కాంగ్రెస్ మాటమార్చడం తగదని అక్బరుద్దీన్ హితవు పలికారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను అతిక్రమించవద్దని, సభను తప్పుదోవ పట్టించడం సరికాదని ఆయన అన్నారు. సమావేశాలు సజావుగా జరిగేలా కాంగ్రెస్ వ్యవహరించాలన్నారు.
కాగా ...సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానానికి చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితేవాయిదా తీర్మానంపై డిప్యూటీ స్పీకర్ స్పందించకుండానే కాంగ్రెస్ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాలు పూర్తి కాగానే ఈ అంశంపై చర్చిద్దామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల తీరు చూస్తుంటే...సభలో ఉండి చర్చలో పాల్గొనడం కంటే...బయటకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారని హరీశ్ విమర్శించారు. జానారెడ్డి వంటి విజ్ఞులు కూడా ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment