చివరిసారి.. చివరిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం
చివరిసారి.. చివరిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం
Published Tue, Dec 27 2016 10:22 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
తెలంగాణ శాసన సభ సమావేశాలు మంగళవారం ఉదయం తీవ్ర గందరగోళం నడుమ కొనసాగాయి. తొలుత ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనే అంశంపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వాయిదా తీర్మానం తీసుకొచ్చాయి. అయితే, స్పీకర్ మధుసూదనాచారి ముందుగా ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడంతో.. పలువురు కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి తీవ్రస్థాయిలో నినాదాలు చేయడం మొదలుపెట్టారు. తమకు న్యాయం జరగాలంటూ 'వుయ్ వాంట్ జస్టిస్' అని నినదించారు. జీరో అవర్‌లో వాటి మీద చర్చిద్దామని స్పీకర్ చెబుతున్నా సభ్యులు మాత్రం వెల్‌లోంచి తమ స్థానాలకు వెళ్లలేదు.
దాంతో ఈ సమయంలో మంత్రి హరీశ్ రావు కల్పించుకున్నారు. ప్రతిపక్ష నాయకులు, సీనియర్లు సభలో ఉన్నారని, వాళ్లు గతంలో మంత్రులుగా కూడా పనిచేశారని, అలాంటివాళ్లు దగ్గరుండి తమ సభ్యులను వెల్‌లోకి పంపడం సరికాదని అన్నారు. సభ్యులను వెనక్కి పిలవాల్సిందిగా తాను ''చివరిసారిగా.. చివరిసారిగా'' విజ్ఞప్తి చేస్తున్నానంటూ హరీశ్‌రావు చెప్పారు. అయినా ప్రతిపక్ష సభ్యులు మాత్రం పట్టించుకోలేదు. దాంతో వాళ్ల నినాదాల మధ్యే సభ్యులు ప్రశ్నలు అడగడం, వాటికి మంత్రులు సమాధానాలు చెప్పడం కొనసాగాయి. మంత్రులు పెద్ద స్వరంతో తమ సమాధానాలు చెప్పడం కనిపించింది.
Advertisement