నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య
హిందూపురం అర్బన్ : నారాయణ స్కూల్లో ఎనిమిదో తరగతి చదివే అఖిలేష్ ప్రసన్న (14) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. స్థానిక ఎస్బీఐ బ్యాంకు సమీపంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో నివాసమున్న రంగనాయకులు పెద్ద కుమారుడు అఖిలేష్ ప్రసన్న గురువారం రాత్రి తన చిన్న తమ్ముడితో దివాన్‌పై పడుకునే విషయంలో గొడవపడ్డారు. తండ్రి ఇద్దరినీ మందలించాడు. దీంతో మనోవేదనకు గురైన ప్రసన్న నేరుగా వంటింట్లో వెళ్లి కూర్చుండిపోయాడు.
శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా వంటింట్లో పైకప్పు కొక్కికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా విద్యార్థి తల్లి కూడా 2011లో ఇదే వంటింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అలాగే ఇతని నాన్నమ్మ కూడా ఆత్మహత్య చేసుకునే తనువు చాలించారు. వన్‌టౌన్ ఎస్ఐ వెంకటేశులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.