Aksaykumar
-
ఖాన్‌లను వెనక్కి నెట్టిన ‘ఖిలాడీ’
బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్.. ఖాన్ల త్రయాన్ని వెనక్కి నెట్టేశారు. కమర్షియల్స్ ద్వారా వచ్చే ఆదాయం విషయంలో అక్షయ్ ముగ్గురు ఖాన్ల కంటే ముందున్నారు. సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీకి చాలా పెద్ద పీట వేస్తారు. ఒక్క సినిమా మంచి విజయం సాధిస్తే చాలు.. అవకాశాలతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఒక్క సారి పేరు వస్తే చాలు.. ఆదాయం సంపాదించటానికి ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటారు సెలబ్రిటీలు. సినిమాలతో పాటు టీవీ కమర్షియల్స్, బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ.. కోట్లలో పారితోషికం తీసుకుంటారు. (చదవండి : ఇదేంది అక్షయ్.. ఇట్లా చేస్తివి!?) అలా యాడ్ ఫిలింస్, కమర్షియల్స్‌కు అత్యధిక పారితోషికం తీసుకునేవారిలో అక్షయ్ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అక్షయ్ చేతిలో రూ.100 కోట్లు విలువ చేసే కమర్షియల్స్ ఒప్పందాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో రణ్వీర్ సింగ్ (రూ.84 కోట్లు), మూడో స్థానంలో ఆయన భార్య దీపికా పదుకొనే (రూ.75 కోట్లు) ఉన్నారు. టాప్ 10లో మిగతా సెలబ్రిటీలు ఏవరంటే.. 4. అమితాబ్ బచ్చన్ (రూ.72 కోట్లు) 5. ఆలియా భట్ (రూ.68 కోట్లు) 6. షారుఖ్ ఖాన్ (రూ.56 కోట్లు) 7. వరుణ్ ధావన్ (రూ.48 కోట్లు) 8. సల్మాన్ ఖాన్ (రూ. 40 కోట్లు) 9. కరీనా కపూర్ (రూ.32 కోట్లు) 10. కత్రినా కైఫ్ (రూ.30 కోట్లు) -
షాకిచ్చిన అక్షయ్!
బాలీవుడ్లో అందరికంటే ఎక్కువ సినిమాలతో బిజీగా ఉండే స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నిర్మాతలకు షాకిచ్చాడు. ‘హీరాఫేరీ 3’లో చేయమని వచ్చిన ఆఫర్‌కు ఏకంగా యాభై కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట. దెబ్బకు మైండ్ బ్లాకయ్యి షేకైన ఫిల్మ్ మేకర్స్ అక్షయ్‌కు రెండు చేతులూ ఎత్తి దండం పెట్టి.. మా వల్ల కాదంటూ జారుకున్నారట. అక్షయ్ కూడా అంతివ్వలేకపోతే నేనూ చేయలేనంటూ ప్రాజెక్ట్ వదిలేసుకున్నాడని ఓ ఆంగ్ల పత్రిక కథనం. అయితే తనను అసలెవరూ అప్రోచ్ కాలేదంటూ రీసెంట్గా అక్షయ్ సెలవిచ్చాడు. ఇదిలా ఉండే... ‘బేబీ’ బాయ్ తప్పుకున్నాక... అభిషేక్‌బచ్చన్, జాన్ అబ్రహమ్లు ఈ చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం. -
నేనూ సూపర్ స్టారే!
బాలీవుడ్ అనగానే... ఖాన్ల త్రయం పేర్లే వినిపిస్తాయి. వీళ్లతో పాటే అక్షయ్‌కుమార్ లాంటివాళ్లు మెగా హిట్లు ఇస్తున్నా... వారికెందుకో అంతగా హైప్ రావడంలేదన్నది తెలిసిందే. షారూఖ్, ఆమిర్, సల్మాన్‌ఖాన్‌లు లీడ్ చేస్తున్న బాలీవుడ్లో మీ పొజిషనేంటని అజయ్దేవ్గణ్ను అడిగితే చిర్రెత్తుకొచ్చినట్టుంది... ఠక్కున నేనూ సూపర్‌స్టార్‌నే అంటూ గరం అయ్యాడు. ఇంకా చెప్పాలంటే తొలి సినిమా ‘పూల్ ఔర్ కాంటే’తోనే తనకు స్టార్ ఇమేజ్ వచ్చిందన్నాడు. నాటి నుంచి వెనక్కి తిరిగి చూసుకొనే పరిస్థితే రాలేదన్నాడు.